Song » Niggadisi Adugu / నిగ్గదీసి అడుగు
Song Details:Actor :
Jagapathi Babu / జగపతి బాబు ,Actress :
Revathi / రేవతి ,Music Director :
Sri / శ్రీ ,Lyrics Writer :
Sirivennela / సిరి వెన్నెల ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
niggadIsi aDugu I siggulEni janAnni aggitOTi kaDugu I samAja jIvacCavAnni mAradu lOkaM mAradu kAlaM dEvuDu digirAnI evvaru EmaipOnI mAradu lOkaM mAradu kAlaM gAlivATu gamanAniki kAlibATa dEniki gorredATu maMdaki nI ~gAnabOdha dEniki E caritra nErcukuMdi paccani pAThaM E kShaNAna mArcukuMdi ciccula mArgaM rAmabANamArpiMdA rAvaNa kAShTaM kRuShNa gIta ApiMdA nitya kurukShEtraM pAta rAti guhalu pAla rAti gRuhAlainA aDavi nIti mAriMdA enni yugAlainA vETa adE vETu adE nATi kathE aMtA naTTaDavulu naDivIdhiki naDicostE viMtA balavaMtule bratakAlanE sUkti maravakuMDa SatAbdAlu cadavalEda I araNya kAMDa
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ మారదు లోకం మారదు కాలం గాలివాటు గమనానికి కాలిబాట దేనికి గొర్రెదాటు మందకి నీ ఙానబోధ దేనికి ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం రామబాణమార్పిందా రావణ కాష్టం కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా వేట అదే వేటు అదే నాటి కథే అంతా నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా బలవంతులె బ్రతకాలనే సూక్తి మరవకుండ శతాబ్దాలు చదవలేద ఈ అరణ్య కాండ
0 comments:
Post a Comment