
Song » Evaru lerani / ఎవరూ లేరని
Song Details:Actor :
Prabhas / ప్రభాస్ ,Actress :
Kangana Rounat / కంగనా రౌనత్ ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer :
Maalavika / మాళవిక ,Song Category : Love & Romantic Songs
evarU lErani anakU.. tODuMTaa nE kaDa varakU chIkaTilOna velugavutaa nI koraku epuDu oMTari nanakU.. nI tOnE chaavU bratuku kaMTiki reppai uMTaalE kaDa varakU prEmatO ceMpanE nimaranaa guMDechaaTu baada cerapanaa nI UpirE avanaa gaDacina kaalamE gaayaparachinaa jNaapakaalu cEdu migilchEnaa maimarapiMcE haayi avanaa oTTEsi nEnu chebutunnaa odili uMDalEnu kShaNamainaa nI saMtOShaaniki haami istunnaa evarU lErani anakU.. tODuMTaa nE kaDa varakU chIkaTilOna velugavutaa nI koraku naa manasE nIkivvanaa nI lOnE sagamavvanaa arachEtini kalipE celimE nEnavannaa muddullO muMcEyanaa, kaugililO daachEyanaa naa kannaa iShTaM nuvvE aMTunnaa taDicostE tala tuDicE cIraMcu nE maaranaa alisostE ippuDainaa naa vaaDinE Uyyaala cEstaa aMTunnaa evarU lErani anakU.. tODuMTaa nE kaDa varakU chIkaTilOna velugavutaa nI koraku ninu pilichE pilupavanaa, ninu vetikE cUpavanaa nI kannula vaakiTa merisE merupavanaa ninu talicE alupavanaa,nI kathalOna malupavanaa EDu aDugula baMdaM nItO anukOnaa manasaMtaa digulaitE ninu ITuku samudaayiMcanaa nI kOsaM tapana paDE nI ammaa naanna nEnavanaa evarU lErani anakU.. tODuMTaa nE kaDa varakU chIkaTilOna velugavutaa nI koraku Click here to hear the song
ఎవరూ లేరని అనకూ.. తోడుంటా నే కడ వరకూ చీకటిలోన వెలుగవుతా నీ కొరకు ఎపుడు ఒంటరి ననకూ.. నీ తోనే చావూ బ్రతుకు కంటికి రెప్పై ఉంటాలే కడ వరకూ ప్రేమతో చెంపనే నిమరనా గుండెచాటు బాద చెరపనా నీ ఊపిరే అవనా గడచిన కాలమే గాయపరచినా జ్ణాపకాలు చేదు మిగిల్చేనా మైమరపించే హాయి అవనా ఒట్టేసి నేను చెబుతున్నా ఒదిలి ఉండలేను క్షణమైనా నీ సంతోషానికి హామి ఇస్తున్నా ఎవరూ లేరని అనకూ.. తోడుంటా నే కడ వరకూ చీకటిలోన వెలుగవుతా నీ కొరకు నా మనసే నీకివ్వనా నీ లోనే సగమవ్వనా అరచేతిని కలిపే చెలిమే నేనవన్నా ముద్దుల్లో ముంచేయనా, కౌగిలిలో దాచేయనా నా కన్నా ఇష్టం నువ్వే అంటున్నా తడిచొస్తే తల తుడిచే చీరంచు నే మారనా అలిసొస్తే ఇప్పుడైనా నా వాడినే ఊయ్యాల చేస్తా అంటున్నా ఎవరూ లేరని అనకూ.. తోడుంటా నే కడ వరకూ చీకటిలోన వెలుగవుతా నీ కొరకు నిను పిలిచే పిలుపవనా, నిను వెతికే చూపవనా నీ కన్నుల వాకిట మెరిసే మెరుపవనా నిను తలిచే అలుపవనా,నీ కథలోన మలుపవనా ఏడు అడుగుల బందం నీతో అనుకోనా మనసంతా దిగులైతే నిను ఈటుకు సముదాయించనా నీ కోసం తపన పడే నీ అమ్మా నాన్న నేనవనా ఎవరూ లేరని అనకూ.. తోడుంటా నే కడ వరకూ చీకటిలోన వెలుగవుతా నీ కొరకు ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment