Saturday, July 25, 2020

Ee abbayi chala manchodu » Oka Manasuto      ఈ అబ్బాయి చాలా మంచోడు » ఒక మనసుతో

July 25, 2020 Posted by Publisher , No comments

Song » Oka Manasuto / ఒక మనసుతో

Song Details:Actor : Ravi teja / రవి తేజ  ,Actress : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Ganga / గంగ  ,  MM. Keeravani / ఎమ్.ఎమ్ కీరవాణి ,Song Category : Others
pallavi:

    oka manasutO oka manasuki muDi eTTA vEstAvU

    A muDi oka koMgumuDayyEdAkA UrukOvU

    prEmA A A A A A
    oka manasutO oka manasuki muDi eTTA vEstAvU

    A muDi oka koMgumuDayyEdAkA UrukOvU

    prEmA A A A A A
caraNaM 1:

    pasi pApalO musinavvulA kapaTAlu lEni prEmA

    munimApulO marumallelA malinAlu lEni prEmA

    aracEtilO nelavaMkalA teracATulEni prEmA

    nadigoMtulO alapATalA taDabATulEni prEmA
    manasula kaliviDi PalitaM prEma ..... tanuvula tAkiDi kAdu sumA

    anaMta jIva yAtralO tODu prEmA

    prEmA A A A A A ......
caraNaM 2:

    adharAlalO taDi merupulA merisEdi kAdu prEmA

    hRudayAlalO dhRuvatAralA alarArutuMdi prEmA

    paruvAlatO karacAlanaM cEsEdi kAdu prEmA

    prANAlalO sthirabaMdhanaM nelakolputuMdi prEmA
    mamatala amRuta varShiNi prEma ..... kOrkela alajaDi kAdu sumA

    niSIdhilOnU vIDipOni nIDa prEmA

    prEmA A A A A A......
 
 
Click here to hear the song
పల్లవి:

    ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావూ

    ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ

    ప్రేమా ఆ ఆ ఆ ఆ ఆ
    ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావూ

    ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ

    ప్రేమా ఆ ఆ ఆ ఆ ఆ
చరణం 1:

    పసి పాపలో ముసినవ్వులా కపటాలు లేని ప్రేమా

    మునిమాపులో మరుమల్లెలా మలినాలు లేని ప్రేమా

    అరచేతిలో నెలవంకలా తెరచాటులేని ప్రేమా

    నదిగొంతులో అలపాటలా తడబాటులేని ప్రేమా
    మనసుల కలివిడి ఫలితం ప్రేమ ..... తనువుల తాకిడి కాదు సుమా

    అనంత జీవ యాత్రలో తోడు ప్రేమా

    ప్రేమా ఆ ఆ ఆ ఆ ఆ ......
చరణం 2:

    అధరాలలో తడి మెరుపులా మెరిసేది కాదు ప్రేమా

    హృదయాలలో ధృవతారలా అలరారుతుంది ప్రేమా

    పరువాలతో కరచాలనం చేసేది కాదు ప్రేమా

    ప్రాణాలలో స్థిరబంధనం నెలకొల్పుతుంది ప్రేమా
    మమతల అమృత వర్షిణి ప్రేమ ..... కోర్కెల అలజడి కాదు సుమా

    నిశీధిలోనూ వీడిపోని నీడ ప్రేమా

    ప్రేమా ఆ ఆ ఆ ఆ ఆ......


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment