Sunday, July 26, 2020

Drushyam » Prati roju panduga      దృశ్యం » ప్రతి రోజు పండుగ

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Prati roju panduga / ప్రతి రోజు పండుగ

Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Meena / మీనా  ,Music Director : Sharreth / శర్రేత్ ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Karthik / కార్తీక్ ,Song Category : Occassional Songs
pallavi :

 prati rOju paMDuga rOjE

 saradAlu tODuMTE

 prati Rutuvu puvvula RutuvE

 cirunavvu pUstuMTE

 madilOna AnaMdAla merupulu modalaitE

 prati cinuku tEnelE

 bratukaMtA tIpilE

 prati malupu mamatElE

 kathalennO mAtO kadilenE ||

 

 caraNaM : 1

 iMTi pEru ullAsamE

 soMta vUru saMtOShamE

 kaMTi niMDugA kalaluMDagA

 cEradaMTa kannIrE

 allaraMtA mA saMpadE

 celladaMTa E ApadE

 tuLli tuLli poMgenaMTa ATApATA

 allibilli AkASaMlO amma nAnna akka celli

 mallepUla mabbulaitE

 ||cinuku||||rOju||

 

 caraNaM : 2

 aMdamaina mA snEhamE

 allukunna O hAramE

 suDigAliki ceDu jvAlaki

 tegipOdu I dAramE

 guDilOna A daivamE aDigEnu AtithyamE

 gummaMlOnE vAlEnaMTa daivAlayaM

 cinni cinni kOpAlannI

  cirruburru tApAlannI

  vaccipOyi urumaitE

 

 ||cinuku||||rOju||
పల్లవి :

 ప్రతి రోజు పండుగ రోజే

 సరదాలు తోడుంటే

 ప్రతి ఋతువు పువ్వుల ఋతువే

 చిరునవ్వు పూస్తుంటే

 మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే

 ప్రతి చినుకు తేనెలే

 బ్రతుకంతా తీపిలే

 ప్రతి మలుపు మమతేలే

 కథలెన్నో మాతో కదిలెనే ॥

 

 చరణం : 1

 ఇంటి పేరు ఉల్లాసమే

 సొంత వూరు సంతోషమే

 కంటి నిండుగా కలలుండగా

 చేరదంట కన్నీరే

 అల్లరంతా మా సంపదే

 చెల్లదంట ఏ ఆపదే

 తుళ్లి తుళ్లి పొంగెనంట ఆటాపాటా

 అల్లిబిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి

 మల్లెపూల మబ్బులైతే

॥చినుకు॥॥రోజు॥

 

 చరణం : 2

 అందమైన మా స్నేహమే

 అల్లుకున్న ఓ హారమే

 సుడిగాలికి చెడు జ్వాలకి

 తెగిపోదు ఈ దారమే

 గుడిలోన ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే

 గుమ్మంలోనే వాలేనంట దైవాలయం

 చిన్ని చిన్ని కోపాలన్నీ

 చిర్రుబుర్రు తాపాలన్నీ

 వచ్చిపోయి ఉరుమైతే

 ॥చినుకు॥॥రోజు॥

0 comments:

Post a Comment