Friday, July 17, 2020

Dr.Chakravarthi » Manasuna Manasai      డా.చక్రవర్తి » మనసున మనసై

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Manasuna Manasai / మనసున మనసై

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Sri sri / శ్రీ శ్రీ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Meloncholic Songs
manasuna manasai..bratukuna bratukai

manasuna manasai..bratukuna bratukai

tODokaruMDina adE bhaagyamu..adE swargamu..



manasuna manasai..bratukuna bratukai

tODokaruMDina adE bhaagyamu..adE swargamu..



aashalu tIrani aavEshamulO..aashayaalalO..aavEdanalO

cIkaTi mUsina EkaaMtamulO 

tODokaruMDina adE bhaagyamu..adE swargamu..



(are!  eppuDoccaaru?

mIku tapObhaMgamu kaligiMcaamaa?

lEdu naa tapassuki meccI aadi daMpatulu pratyakShamayyaaru.

mari aapEshaavEM..paaDu.

aadi daMpatulE aDugutuMTE kaadanagalanaa..maadhavI dEvi gaaru,mIku abhyaMtaraM lEkuMTE 

kaadanakaMDi.bratimaaliMcukOvaalaa! U..)



ninnu ninnugaa prEmiMcuTaku..nI kOsamE kannIru niMcuTaku

ninnu ninnugaa prEmiMcuTaku..nI kOsamE kannIru niMcuTaku

nEnunnaanani niMDuga palikE

tODokaruMDinaa adE bhaagyamu..adE swargamu..



celimiye karuvai..valapE arudai

cedarina hRudayamE shilayaipOgaa

nI vyadha telisI nIDaga nilicE



tODokaruMDinaa adE bhaagyamu..adE swargamu..



manasuna manasai..bratukuna bratukai

tODokaruMDina adE bhaagyamu..adE swargamu..



 
 
Click here to hear the song
మనసున మనసై..బ్రతుకున బ్రతుకై

మనసున మనసై..బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే భాగ్యము..అదే స్వర్గము..



మనసున మనసై..బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే భాగ్యము..అదే స్వర్గము..



ఆశలు తీరని ఆవేశములో..ఆశయాలలో..ఆవేదనలో

చీకటి మూసిన ఏకాంతములో 

తోడొకరుండిన అదే భాగ్యము..అదే స్వర్గము..



(అరె!  ఎప్పుడొచ్చారు?

మీకు తపోభంగము కలిగించామా?

లేదు నా తపస్సుకి మెచ్చీ ఆది దంపతులు ప్రత్యక్షమయ్యారు.

మరి ఆపేశావేం..పాడు.

ఆది దంపతులే అడుగుతుంటే కాదనగలనా..మాధవీ దేవి గారు,మీకు అభ్యంతరం లేకుంటే 

కాదనకండి.బ్రతిమాలించుకోవాలా! ఊ..)



నిన్ను నిన్నుగా ప్రేమించుటకు..నీ కోసమే కన్నీరు నించుటకు

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు..నీ కోసమే కన్నీరు నించుటకు

నేనున్నానని నిండుగ పలికే

తోడొకరుండినా అదే భాగ్యము..అదే స్వర్గము..



చెలిమియె కరువై..వలపే అరుదై

చెదరిన హృదయమే శిలయైపోగా

నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే



తోడొకరుండినా అదే భాగ్యము..అదే స్వర్గము..



మనసున మనసై..బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే భాగ్యము..అదే స్వర్గము..


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment