Tuesday, July 14, 2020

Dhamarukam » Kanyakumari      ఢమరుకం » కన్యాకుమారి

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Kanyakumari / కన్యాకుమారి

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున , Anuskha / అనుష్క  ,},{SongDetails:Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,},{SongDetails:Lyrics Writer : Sahithi / సాహితి ,},{SongDetails:Singer : Jaspreet Jasz / జాస్‌ప్రీత్ జాస్ట్ ,  Sunitha / సునీత ,},{SongDetails:Song Category : Love & Romantic Songs
pallavi :

kanyAkumAri O... kanyAkumAri

nI guMDellOki cErAlaMTE eTuvaipammA dAri

mInAkumAri O... mInAkumAri

nI kaLlallOna uMDAlaMTE EMceyyAlE nArI

vEsavi kannA veccaga nAtO muccaTalADAli

vennela kannA callaga nAkE kaugili ivvAli

cakkera kannA tiyyaga nannE prEmiMcAli

rAvE nI pEru venaka nA pEru peDatA madhubAla

rArA nI muddumATaku nA sOkulistA gOpAlA



caraNaM : 1

hO... nI mIsaM cUsi melitirigenu vayyAraM

adi tAkitE cAlu nidarErAni rEyika jAgAraM

naDumE nayagAraM A naDakE siMgAraM

nI naDumuna naligE maDataku cEstA muddula aBiShEkaM

kaLlatO nannE gArADi cEyaku madanuDi maridivalE

kaLlE mUsi callaga jAraku pUbaMtallE

rAvE nI pEru venaka nA pEru peDatA madhubAla

rArA nI muddumATaku nA sOkulistA gOpAlA



kanyAkumAri O... kanyAkumAri

nI guMDellOki cErAlaMTE eTuvaipammA dAri

mInAkumAri O... mInAkumAri

nI kaLlallOna uMDAlaMTE EMceyyAlE nArI



caraNaM : 2

hO... sUTiga nI cUpE nA guMDenu tAkiMdi

pErE teliyani jvaramE EdO oMTiki sOkiMdi

nIlO nippuMdi adi nAlO ragiliMdi

edalokaTai telavArE varaku Aranu lemmaMdi

ukkiribikkiri cEsE kOrika erugadu idivaraku

oMTiri tuMTiri tummedalAgA aMTukupOku

rAvE nI pEru venaka nA pEru peDatA madhubAla

rArA nI muddumATaku nA sOkulistA gOpAlA



kanyAkumAri O... kanyAkumAri

nI guMDellOki cErAlaMTE eTuvaipammA dAri

rAja kumArA ..O rAja kumArA

nA guMDellOnE unnAvayyO eMduku iMkA dAri
పల్లవి :

కన్యాకుమారి ఓ... కన్యాకుమారి

నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మా దారి

మీనాకుమారి ఓ... మీనాకుమారి

నీ కళ్లల్లోన ఉండాలంటే ఏంచెయ్యాలే నారీ

వేసవి కన్నా వెచ్చగ నాతో ముచ్చటలాడాలి

వెన్నెల కన్నా చల్లగ నాకే కౌగిలి ఇవ్వాలి

చక్కెర కన్నా తియ్యగ నన్నే ప్రేమించాలి

రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల

రారా నీ ముద్దుమాటకు నా సోకులిస్తా గోపాలా



చరణం : 1

హో... నీ మీసం చూసి మెలితిరిగెను వయ్యారం

అది తాకితే చాలు నిదరేరాని రేయిక జాగారం

నడుమే నయగారం ఆ నడకే సింగారం

నీ నడుమున నలిగే మడతకు చేస్తా ముద్దుల అభిషేకం

కళ్లతో నన్నే గారాడి చేయకు మదనుడి మరిదివలే

కళ్లే మూసి చల్లగ జారకు పూబంతల్లే

రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల

రారా నీ ముద్దుమాటకు నా సోకులిస్తా గోపాలా



కన్యాకుమారి ఓ... కన్యాకుమారి

నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మా దారి

మీనాకుమారి ఓ... మీనాకుమారి

నీ కళ్లల్లోన ఉండాలంటే ఏంచెయ్యాలే నారీ



చరణం : 2

హో... సూటిగ నీ చూపే నా గుండెను తాకింది

పేరే తెలియని జ్వరమే ఏదో ఒంటికి సోకింది

నీలో నిప్పుంది అది నాలో రగిలింది

ఎదలొకటై తెలవారే వరకు ఆరను లెమ్మంది

ఉక్కిరిబిక్కిరి చేసే కోరిక ఎరుగదు ఇదివరకు

ఒంటిరి తుంటిరి తుమ్మెదలాగా అంటుకుపోకు

రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల

రారా నీ ముద్దుమాటకు నా సోకులిస్తా గోపాలా



కన్యాకుమారి ఓ... కన్యాకుమారి

నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మా దారి

రాజ కుమారా ..ఓ రాజ కుమారా

నా గుండెల్లోనే ఉన్నావయ్యో ఎందుకు ఇంకా దారి

0 comments:

Post a Comment