Friday, July 10, 2020

Devi Putrudu » Aakasham Loni      దేవి పుత్రుడు » ఆకాశంలోని

July 10, 2020 Posted by Publisher , No comments




Song » Aakasham Loni / ఆకాశంలోని

Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Soundarya / సౌందర్య  ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Jonnavithulla / జొన్నవిత్తుల ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Children Songs
aakaashaMlOni caMdamaama baMgaaru paapai vaccEnammaa

saagaramaayE saMbaramE swaagatamaayE saMtasamE

naalOni prEma pratirUpamE I iMTa taanE siridIpamE

aakaashaMlOni caMdamaama baMgaaru paapai vaccEnammaa

saagaramaayE saMbaramE swaagatamaayE saMtasamE

naalOni prEma pratirUpamE I iMTa taanE siridIpamE



niMgilO nIlimaMtaa uMgaraM cEsi istaa UrEgistaa

saagaraM poMgulannI gavvalaa gaunu cEstaa gaaraaM cEstaa

tellani Enugupai naa paapanu ekkistaa

cilakalu haMsalavi aaDEMduku rappistaa

harivillE kaagaa uyyaalalE kOyilalE paaDE naa jOlalE

bommalugaa maarE aa cukkalE diShTaMtaa tIsi naludikkulE



paapalO aMdamaMtaa brahmakE aMdanaMtaa eMtO viMTaa

ammalO prEma aMtaa naannalO ThIvi aMtaa vaccEnaMTaa

tiyyani navvEmO divi taarala velugaMtaa

kammani pilupEmO I ammaku pulakiMtaa

aDugEsi tIstE haMsa jODi kulukullO taanE kUcipUDi

cirunavvulOna shrIramaNi maaraamu cEsE baalaamaNi



aakaashaMlOni caMdamaama baMgaaru paapai vaccEnammaa

saagaramaayE saMbaramE swaagatamaayE saMtasamE

naalOni prEma pratirUpamE I iMTa taanE siridIpamE






 


Click here to hear the song
ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా

సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే

నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే

ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా

సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే

నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే



నింగిలో నీలిమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా

సాగరం పొంగులన్నీ గవ్వలా గౌను చేస్తా గారాం చేస్తా

తెల్లని ఏనుగుపై నా పాపను ఎక్కిస్తా

చిలకలు హంసలవి ఆడేందుకు రప్పిస్తా

హరివిల్లే కాగా ఉయ్యాలలే కోయిలలే పాడే నా జోలలే

బొమ్మలుగా మారే ఆ చుక్కలే దిష్టంతా తీసి నలుదిక్కులే



పాపలో అందమంతా బ్రహ్మకే అందనంతా ఎంతో వింటా

అమ్మలో ప్రేమ అంతా నాన్నలో ఠీవి అంతా వచ్చేనంటా

తియ్యని నవ్వేమో దివి తారల వెలుగంతా

కమ్మని పిలుపేమో ఈ అమ్మకు పులకింతా

అడుగేసి తీస్తే హంస జోడి కులుకుల్లో తానే కూచిపూడి

చిరునవ్వులోన శ్రీరమణి మారాము చేసే బాలామణి



ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా

సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే

నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే






 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment