
Song » Jagamantaa / జగమంతా
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Krishna kumari / కృష్ణ కుమారి ,Music Director :
Aswathama / అశ్వత్థామ ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
jagamaMtaa maarinadi javaraala nIvalana ||jaga|| janmamE tariMcinadi jatagaaDaa nIvalana ||janma|| aNuvu aNuvunaa aMdamE toNikisa laaDinadI toNikisa laaDinadI ||aNuvu|| kanula muMdu swargamE ||kanula|| gajjEkaTTi aaDinadi gajjEkaTTi aaDinadi divinuMDi dEvatalE digivacci dIviMciri ||divi|| tIyani haayilO manasu ||tIyani|| tElitEli sOlinadi tElitEli sOlinadi ||janma|| rekkavippi hRudayaalE ekkaDikO egirinavi cakkani lOkaalu jayiMci ||cakkani|| saamraajyaa lElinavi ||saamraajya|| jagamaMtaa maarinadi nijamaina prEmavalana ||jaga||
జగమంతా మారినది జవరాల నీవలన ||జగ|| జన్మమే తరించినది జతగాడా నీవలన ||జన్మ|| అణువు అణువునా అందమే తొణికిస లాడినదీ తొణికిస లాడినదీ ||అణువు|| కనుల ముందు స్వర్గమే ||కనుల|| గజ్జేకట్టి ఆడినది గజ్జేకట్టి ఆడినది దివినుండి దేవతలే దిగివచ్చి దీవించిరి ||దివి|| తీయని హాయిలో మనసు ||తీయని|| తేలితేలి సోలినది తేలితేలి సోలినది ||జన్మ|| రెక్కవిప్పి హృదయాలే ఎక్కడికో ఎగిరినవి చక్కని లోకాలు జయించి ||చక్కని|| సామ్రాజ్యా లేలినవి ||సామ్రాజ్య|| జగమంతా మారినది నిజమైన ప్రేమవలన ||జగ||
0 comments:
Post a Comment