Song » Rayini matram Kante / రాయిని మాత్రం కంటే
Song Details:Actor :
Kamal Haasan / కమల్ హాసన్ ,Actress :
Asin / ఆసిన్ ,Music Director :
Himesh Reshmiya / హిమేష్ రేష్మియా ,Lyrics Writer :
Vennelakanti / వెన్నెలకంటి ,Singer :
Chorus / బృంద గాయనీ గాయకులు -- ,
Hari Haran / హరిహరన్ ,Song Category : Others
pallavi : OM... namO naaraayaNaaya raayini maatraM kaMTae daevuDu kanaraaDu daevuni maatraM kaMTae daehaM kanaraadu raayini maatraM kaMTae daevuDu kanaraaDu daevuni maatraM kaMTae daehaM kanaraadu harini talachu naa hRdayaM naeDu haruni talachuTa jaragadulae ashTa aksharaM telisina nOru paMcha aksharaM palakadulae vaMkara kannula meeru SaMkara kiMkarulu vaishNavunaeM chaestaaru aa yamakiMkarulu charaNaM : 1 niluvu naamaM daalchu talanu meeku vaMchanulae niluvunaa nanu cheelchutunnaa maaTa maarchanulae niluvu naamaM daalchu talanu meeku vaMchanulae niluvunaa nanu cheelchutunnaa maaTa maarchanulae niluvunaa nuvu cheelchutunnaa maaTa maarchanulae veera Saivula bediriMpulaku parama vaishNavaM aagadulae prabhuvu aanatiki jaDisaenaaDu paDamaTa sooryuDu poDavaDulae raajyalakshmi naathuDu SreenivaasuDae SreenivaasuDi vaarasuDee vishNudaasuDae daeSaannaelae vaaraMtaa raajya daasulae raajulaku raaju ee raMgaraajanae charaNaM : 2 neeTilOna muMchinaMta neeti chaavadulae guMDelOna velugunu niMpae jyOti aaradulae neeTilOna muMchinaMta neeti chaavadulae guMDelOna velugunu niMpae jyOti aaradulae divvelanaarpae suDigaali vennela velugunu aarpaenaa naelanu muMchae jaDivaana aakaaSaannae taDipaenaa SaivaM okkaTi maatraM daivaM kaadaMTa daivaM kOsaM pOrae samayaM laedaMTa raayini maatraM kaMTae daevuDu kanaraaDu daevuni maatraM kaMTae daehaM kanaraadu
పల్లవి : ఓం... నమో నారాయణాయ రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దేహం కనరాదు రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దేహం కనరాదు హరిని తలచు నా హృదయం నేడు హరుని తలచుట జరగదులే అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే వంకర కన్నుల మీరు శంకర కింకరులు వైష్ణవునేం చేస్తారు ఆ యమకింకరులు చరణం : 1 నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే నిలువునా నను చీల్చుతున్నా మాట మార్చనులే నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే నిలువునా నను చీల్చుతున్నా మాట మార్చనులే నిలువునా నువు చీల్చుతున్నా మాట మార్చనులే వీర శైవుల బెదిరింపులకు పరమ వైష్ణవం ఆగదులే ప్రభువు ఆనతికి జడిసేనాడు పడమట సూర్యుడు పొడవడులే రాజ్యలక్ష్మి నాథుడు శ్రీనివాసుడే శ్రీనివాసుడి వారసుడీ విష్ణుదాసుడే దేశాన్నేలే వారంతా రాజ్య దాసులే రాజులకు రాజు ఈ రంగరాజనే చరణం : 2 నీటిలోన ముంచినంత నీతి చావదులే గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే నీటిలోన ముంచినంత నీతి చావదులే గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే దివ్వెలనార్పే సుడిగాలి వెన్నెల వెలుగును ఆర్పేనా నేలను ముంచే జడివాన ఆకాశాన్నే తడిపేనా శైవం ఒక్కటి మాత్రం దైవం కాదంట దైవం కోసం పోరే సమయం లేదంట రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
0 comments:
Post a Comment