Sunday, July 26, 2020

Dammu » Ruler...Ruler      దమ్ము » రూలర్...

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Ruler...Ruler / రూలర్...

Song Details:Actor : Jr-ntr / జూనియర్ ఎన్ టీ ఆర్  ,Actress : Karthika / కార్తీక ,  Trisha / త్రిష  ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Geetha madhuri / గీతా మాధురి  ,  Prithvi chandra / పృథ్వీచంద్ర ,  Revanth / రేవంత్ ,Song Category : Others
sAkI : aMga vaMga kEraLa kaLiMga gauDa kuMtala
vidarBa magadha siMhaLa sALva gauLa barbara
avaMti cOLa lATa pAMDya cEri madra
cakravartuleMdarunnA vIDu EkavIruDu 
Ekaika kShAtravIruDu
kAvya citralEKanaM saMgIta Silpa nATakaM 
sAmudrikaM ucCATanaM 
AkarShaNaM vidvEShaNaM
agni jala vayastaMBaM 
bahukaLApravINuDu
pravINuDu navInuDu...
bANa KaDga cEri Sakti yaShTi prASa gada pASa
vajra daMDa kuMta SUla 
dhanurvidyA prapUrNuDu
GanaGanaGana GanuDu
agiNita guNa GanuDu
janagaNamuna GanuDu 
rUlar... rUlar...



pallavi :



pracaMDa caMDa mArtAMDa tEjA...
rAjAdhi rAjAdhirAjA
aKaMDa maMDalAnaMda BOjA... 
rAjadhi rAjAdhirAjA
caritalO velugutunna jyOti nIdE
jagatilO egurutunna kIrti nIdE 
pOru nIdi pEru nIdi...
Buvana Bavana karuNa kiraNa 
praBuvu nuvvulE
rUlar... rUlar...
||pracaMDa ||



caraNaM : 1



muMdu nuMDi muMcukoccu 
mRugAlanainA
piDikilitO PeLaPeLaPeLa kUlcEstA
venaka nuMDi tarumukoccu jvAlalanainA
pAdaMtO dabadabadaba tokkEstA
aMdukE maraMdukE maraMdukE
aMdAlani aracEtilO peDutunnA
nIkE aMdAlani ArATa paDutunnA
keraTamai urukutunna curuku nIdE
kadanamai dumukutunna duDuku nIdE
ATa nIdi vETa nIdi...
Buvana Bavana karuNa kiraNa 
praBuvu nuvvulE
rUlar... rUlar...


caraNaM : 2



bIda dhanika aMtarAlu aMtaM cEsi
aMdaripai samaBAvaM cUpAli
baMdhuprIti vargaprIti dUraM cEsi
anunityaM samadharmaM cATAli
aMdukE maraMdukE maraMdukE
prANaMlO sagaBAgaM istunnA
nI praNayaMtO saMpUrNamautunnA
SiKaramE Sirasu vaMcu gelupu nIdE
gaganamE melika tirugu merupu nIdE
nIti nIdi KyAti nIdi...
Buvana Bavana karuNa kiraNa
praBuvu nuvvulE
rUlar... 
 
Click here to hear the song
సాకీ : అంగ వంగ కేరళ కళింగ గౌడ కుంతల
విదర్భ మగధ సింహళ సాళ్వ గౌళ బర్బర
అవంతి చోళ లాట పాండ్య చేరి మద్ర
చక్రవర్తులెందరున్నా వీడు ఏకవీరుడు 
ఏకైక క్షాత్రవీరుడు
కావ్య చిత్రలేఖనం సంగీత శిల్ప నాటకం 
సాముద్రికం ఉచ్ఛాటనం 
ఆకర్షణం విద్వేషణం
అగ్ని జల వయస్తంభం 
బహుకళాప్రవీణుడు
ప్రవీణుడు నవీనుడు...
బాణ ఖడ్గ చేరి శక్తి యష్టి ప్రాశ గద పాశ
వజ్ర దండ కుంత శూల 
ధనుర్విద్యా ప్రపూర్ణుడు
ఘనఘనఘన ఘనుడు
అగిణిత గుణ ఘనుడు
జనగణమున ఘనుడు 
రూలర్... రూలర్...



పల్లవి :



ప్రచండ చండ మార్తాండ తేజా...
రాజాధి రాజాధిరాజా
అఖండ మండలానంద భోజా... 
రాజధి రాజాధిరాజా
చరితలో వెలుగుతున్న జ్యోతి నీదే
జగతిలో ఎగురుతున్న కీర్తి నీదే 
పోరు నీది పేరు నీది...
భువన భవన కరుణ కిరణ 
ప్రభువు నువ్వులే
రూలర్... రూలర్...
॥ప్రచండ ॥



చరణం : 1



ముందు నుండి ముంచుకొచ్చు 
మృగాలనైనా
పిడికిలితో ఫెళఫెళఫెళ కూల్చేస్తా
వెనక నుండి తరుముకొచ్చు జ్వాలలనైనా
పాదంతో దబదబదబ తొక్కేస్తా
అందుకే మరందుకే మరందుకే
అందాలని అరచేతిలో పెడుతున్నా
నీకే అందాలని ఆరాట పడుతున్నా
కెరటమై ఉరుకుతున్న చురుకు నీదే
కదనమై దుముకుతున్న దుడుకు నీదే
ఆట నీది వేట నీది...
భువన భవన కరుణ కిరణ 
ప్రభువు నువ్వులే
రూలర్... రూలర్...


చరణం : 2



బీద ధనిక అంతరాలు అంతం చేసి
అందరిపై సమభావం చూపాలి
బంధుప్రీతి వర్గప్రీతి దూరం చేసి
అనునిత్యం సమధర్మం చాటాలి
అందుకే మరందుకే మరందుకే
ప్రాణంలో సగభాగం ఇస్తున్నా
నీ ప్రణయంతో సంపూర్ణమౌతున్నా
శిఖరమే శిరసు వంచు గెలుపు నీదే
గగనమే మెలిక తిరుగు మెరుపు నీదే
నీతి నీది ఖ్యాతి నీది...
భువన భవన కరుణ కిరణ
ప్రభువు నువ్వులే
రూలర్... 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment