Song » Yamahaa nagari / యమహా నగరి
Song Details:Actor :
Chiranjeevi / చిరంజీవి ,Actress :
Soundarya / సౌందర్య ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Hari Haran / హరిహరన్ ,Song Category : Others
sarimAmagari sasa sanidapasa(2) rimadanidapasAsanidapa madapamari pa: yamahAnagari kalakattA puri(2) namahohubili haurA vAradhi yamahAnagari kalakattA puri ciru tyAgarAju nI kRutinE palikenu mari ||3|| ||yama|| ca: nEtAjI puTTina cOTa gItAMjali pUsina cOTa pADanA telugulO A: haMsa pADina pATE A naMduDu cUpina bATa sAganA parugulO parugu tIsaiMdi paTnaM bratukutO veyyi paMdeM kaDaku cErAli gamyaM kadilipOrA okaritO okariki muKaparicayamulu dorakani kShaNamuna biji biji bratukula gaji biji urukula parugulalO ||yama|| ca: beMgAlI kOkila bAla telugiMTi kODalu pilla mAnini sarOjini rOjaMtA sUryuDikriMda rAtraMtA rajanIgaMdhA sAganI padagurU prEmalE lEni lOkaM dEvadA mArku maikaM SarannavalABiShEkaM telusukOrA kalalaku nelavaTa kaLalaku koluvaTa tidulaku selavaTa atidhula goDavaTa kalakaTa nagarapu kiTakiTalO || yama|| ca: vaMdEmAtaramE annA vaMgA BUtalamE minna jAtikE gItarA mAtaMgi kALI nilaya cOraMgI raMgula duniyA nIdirA vinu guru satya jit rE sitArA es Di barman ki dhArA dherIsA kI kumArA kadali rArA janaganamuna svarapada ravamuna hRudayapu layalanu Srutiparicinapriya Sukapika muKasuKa ravamulatO ||yama|| Click here for the song youtu.be/JFeug5KJYLU
సరిమామగరి సస సనిదపస(2) రిమదనిదపసాసనిదప మదపమరి ప: యమహా నగరి కలకత్తా పురి(2) నమహో హుబిలి హౌరా వారధి యమహా నగరి కలకత్తా పురి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి ||౩|| ||యమ|| నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా పరుగులో పరుగు తీసింది పట్నం బ్రతుకుతో వెయ్యి పందెం కడకు చేరాలి గమ్యం కదిలిపోరా ఒకరితో ఒకరికి ముఖపరిచయములు దొరకని క్షణమున బిజి బిజి బ్రతుకుల గజి బిజి ఉరుకుల పరుగులలో ||యమ|| బెంగాలీ కోకిల బాల తెలుగింటి కోడలు పిల్ల మానిని సరోజిని రోజంతా సూర్యుడిక్రింద రాత్రంతా రజనీగంధా సాగనీ పద గురూ ప్రేమలే లేని లోకం దేవదా మార్కు మైకం శరన్నవలాభిషేకం ... తెలుసుకోరా కలలకు నెలవట కళలకు కొలువట తిదులకు సెలవట అతిధుల గొడవట కలకట నగరపు కిటకిటలో || యమ|| వందేమాతరమే అన్నా వంగా భూతలమే మిన్న జాతికే గీతరా మాతంగి కాళీ నిలయ చౌరంగీ రంగుల దునియా .. నీదిరా విను గురు సత్య జిత్ రే సితారా ఎస్ డి బర్మన్ కి ధారా ధెరీసా కీ కుమారా కదలి రారా జనగణమున స్వరపద రవమున హృదయపు లయలను శ్రుతిపరిచిన ప్రియ శుకపిక ముఖసుఖ రవములతో ||యమ|| పాట కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి youtu.be/JFeug5KJYLU
0 comments:
Post a Comment