Song » Nindu Akaarsamanta / నిండు ఆకాశమంత
Song Details:Actor :
Venkatesh / వెంకటేష్ ,Actress :
Vijayashanthi / విజయశాంతి ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Bhuvana Chandra / భువన చంద్ర ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: niMDu aakaaSamaMta manasu unna raajuvayyaa paMDu vennelalaaMTi challani choopula raeDuvayyaa muchchaTagaa oka taaLi kaTTi... niMgiki naelaku nichchena vaesina daevuDu neevae chinaraayuDu neevae IIniMDuII charaNaM : 1 gaalilOna taelae paruvaala poola komma naelavaalipOgaa chivuriMpa chaesinaavae pasupu taaDu meeda lOkaanikunna praema manishimeeda laedu ee neetikevaru brahma tappavuraa haeLanalu vaedanalae nee hitulu guMDeku baMDaku vaaradhi kaTTina daevuDi leela idi kaakula gOla IIniMDuII charaNaM : 2 neeTilOni chaepa kanneeru evarikeruka gooTilOni chiluka gubulaedo evarikeruka nuduTi meeda raata vaerevaru maarchagalaru nyaayamoorti neevae teerpevaru teerchagalaru oMTaridi nee payanaM nibbaramae neekabhayaM tappuki oppuki gaMtalu kaTTina daevuDi leela idi kaakula gOla IIniMDuII
పల్లవి: నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా ముచ్చటగా ఒక తాళి కట్టి... నింగికి నేలకు నిచ్చెన వేసిన దేవుడు నీవే చినరాయుడు నీవే ॥నిండు॥ చరణం : 1 గాలిలోన తేలే పరువాల పూల కొమ్మ నేలవాలిపోగా చివురింప చేసినావే పసుపు తాడు మీద లోకానికున్న ప్రేమ మనిషిమీద లేదు ఈ నీతికెవరు బ్రహ్మ తప్పవురా హేళనలు వేదనలే నీ హితులు గుండెకు బండకు వారధి కట్టిన దేవుడి లీల ఇది కాకుల గోల ॥నిండు॥ చరణం : 2 నీటిలోని చేప కన్నీరు ఎవరికెరుక గూటిలోని చిలుక గుబులేదొ ఎవరికెరుక నుదుటి మీద రాత వేరెవరు మార్చగలరు న్యాయమూర్తి నీవే తీర్పెవరు తీర్చగలరు ఒంటరిది నీ పయనం నిబ్బరమే నీకభయం తప్పుకి ఒప్పుకి గంతలు కట్టిన దేవుడి లీల ఇది కాకుల గోల ॥నిండు॥
0 comments:
Post a Comment