Tuesday, July 28, 2020

Chettu kinda Pleader » Nerugaari paripoku...      చెట్టు కింద ప్లీడర్ » నీరుగారి పారిపోకు...

July 28, 2020 Posted by Publisher , No comments

Song » Nerugaari paripoku... / నీరుగారి పారిపోకు...

Song Details:Actor : Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress : Kinnera / కిన్నెర ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

    nIrugAri pAripOku... nIrasAna jAripOku ..lE mElukO...

    mArumUla dAgipOku ...piriki maMdu tAgabOku .. lE mElukO...

    eMdukI BayaM... aMdukO jayaM...

    nIDalAga nIku tODu nEnE lEnA...



    nIrugAri pAripOku... nIrasAna jAripOku ..lE



caraNaM 1:

    rUpurEKalO curukaina cUpulO .. nIvE jAkI cAn...

    koMDarALLanE nI kaMDarAlatO lEpE... sUpar mAn



    kIculATalu kuMPula PaiTulu rAvE ...EM cEstAM..

    egiri dUkaDaM alavATu lEdelA ammO... paDi castAM...

    aha eMtavAralaina nIku cIma dOma...

    hayyO ! eMdukamma aMta cETu dhImA BAmA...



    hi mAn lA nuvvu huMkariMcarA...

    A paina nA prANaM hariMcarA...

    vIrasvargamE variMcarA...



    mAyadAri mATalEla mAyalEDi vETalEla .... nE rAnu pO..

    cEtagAni SauryamEla ..IdalEni lOtulEla hA...!



caraNaM 2:

    pAlapAluDA palanATi bAluDA .. EdI nI dhairyaM...

    kadanavIruDA asahAya SUruDA .. kAnI GanakAryaM...

    nIku mokkutA ...oka mUla nakkutA .. pOrE vaddaMTa..

    batuku dakkitE balusAku mokkutA .. pOnI nanniTTA...



    aha kIDu nIDa cUsi nIku BayamA BImA...

    cEyalEdu iMtavaraku jIvita BImA...

    AMjanEyuDA nI Sakti telusukO...

    ammanAyanO nanniMka viDicipO...

    jaMku boMku lEka naDicipO...





    mAyadAri mATalEla ...mAyalEDi vETalEla .... nE rAnu pO..

    cEtagAni SauryamEla IdalEni lOtulEla nE rAnu pO...

    pADu roMpilO nannu diMpakE...

    muMdu nuyyi venuka goyyi...cAvE KAyaM...



    nIrugAri pAripOku... nIrasAna jAripOku ..lE mElukO...

    mArumUla dAgipOku ...piriki maMdu tAgabOku .. lE .......


 
Click here to hear the song
పల్లవి:

    నీరుగారి పారిపోకు... నీరసాన జారిపోకు ..లే మేలుకో...

    మారుమూల దాగిపోకు ...పిరికి మందు తాగబోకు .. లే మేలుకో...

    ఎందుకీ భయం... అందుకో జయం...

    నీడలాగ నీకు తోడు నేనే లేనా...



    నీరుగారి పారిపోకు... నీరసాన జారిపోకు ..లే



చరణం 1:

    రూపురేఖలో చురుకైన చూపులో .. నీవే జాకీ చాన్...

    కొండరాళ్ళనే నీ కండరాలతో లేపే... సూపర్ మాన్



    కీచులాటలు కుంఫుల ఫైటులు రావే ...ఏం చేస్తాం..

    ఎగిరి దూకడం అలవాటు లేదెలా అమ్మో... పడి చస్తాం...

    అహ ఎంతవారలైన నీకు చీమ దోమ...

    హయ్యో ! ఎందుకమ్మ అంత చేటు ధీమా భామా...



    హి మాన్ లా నువ్వు హుంకరించరా...

    ఆ పైన నా ప్రాణం హరించరా...

    వీరస్వర్గమే వరించరా...



    మాయదారి మాటలేల మాయలేడి వేటలేల .... నే రాను పో..

    చేతగాని శౌర్యమేల ..ఈదలేని లోతులేల హా...!



చరణం 2:

    పాలపాలుడా పలనాటి బాలుడా .. ఏదీ నీ ధైర్యం...

    కదనవీరుడా అసహాయ శూరుడా .. కానీ ఘనకార్యం...

    నీకు మొక్కుతా ...ఒక మూల నక్కుతా .. పోరే వద్దంట..

    బతుకు దక్కితే బలుసాకు మొక్కుతా .. పోనీ నన్నిట్టా...



    అహ కీడు నీడ చూసి నీకు భయమా భీమా...

    చేయలేదు ఇంతవరకు జీవిత భీమా...

    ఆంజనేయుడా నీ శక్తి తెలుసుకో...

    అమ్మనాయనో నన్నింక విడిచిపో...

    జంకు బొంకు లేక నడిచిపో...



    మాయదారి మాటలేల ...మాయలేడి వేటలేల .... నే రాను పో..

    చేతగాని శౌర్యమేల ఈదలేని లోతులేల నే రాను పో...

    పాడు రొంపిలో నన్ను దింపకే...

    ముందు నుయ్యి వెనుక గొయ్యి...చావే ఖాయం...



    నీరుగారి పారిపోకు... నీరసాన జారిపోకు ..లే మేలుకో...

    మారుమూల దాగిపోకు ...పిరికి మందు తాగబోకు .. లే .......


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment