Tuesday, July 7, 2020

Chenchulakshmi » Chettulekkagalavaa చెంచులక్ష్మి » చెట్టులెక్క గలవా

July 07, 2020 Posted by Publisher , No comments
 
Song » Chettulekkagalavaa / చెట్టులెక్క గలవా
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Anjali devi / అంజలి దేవి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Folk Songs
cheTTulekkagalavaa O narahari 
puTTalekkagalavaa
cheTTulekki A chiTaarukommala
chiguru kOyagalavaa
O narahari chiguru kOyagalavaa
cheTTulekkagalanE O chemchita puTTalekkagalanE
cheTTulekki A chiTaaru kommala
chiguru kOyagalanE O chemchita
chiguru kOyagalanE
urakalEyagalavaa O narahari
parugulettagalavaa uraka
UDa paTTukuni jaaruDu bamDaku
Ugi chEragalavaa
urakalEyagalanE O chemchita
parugulettagalanE
UDapaTTukuni jaaruDu bamDaku
Ugi chEragalanE O chemchita
Ugi chEragalanE
gurini choosukoni kanulu moosukuni
baaNamEyagalanE O chemchita
baaNamEyagalanE
O chemchita ninnu mimchagalanE cheTTu
taguvulEla egataaLikaTTaneevaa O chemchita
taaLi kaTTaneevaa
manasu telusukuni marulu choopitE
manuvunaaDanistaa O narahari
manuvunaaDanistaa O narahari
 
Click here to hear the song
చెట్టులెక్కగలవా ఓ నరహరి 
పుట్టలెక్కగలవా
చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మల
చిగురు కోయగలవా
ఓ నరహరి చిగురు కోయగలవా
చెట్టులెక్కగలనే ఓ చెంచిత పుట్టలెక్కగలనే
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల
చిగురు కోయగలనే ఓ చెంచిత
చిగురు కోయగలనే
ఉరకలేయగలవా ఓ నరహరి
పరుగులెత్తగలవా ఉరక
ఊడ పట్టుకుని జారుడు బండకు
ఊగి చేరగలవా
ఉరకలేయగలనే ఓ చెంచిత
పరుగులెత్తగలనే
ఊడపట్టుకుని జారుడు బండకు
ఊగి చేరగలనే ఓ చెంచిత
ఊగి చేరగలనే
గురిని చూసుకొని కనులు మూసుకుని
బాణమేయగలనే ఓ చెంచిత
బాణమేయగలనే
ఓ చెంచిత నిన్ను మించగలనే చెట్టు
తగువులేల ఎగతాళికట్టనీవా ఓ చెంచిత
తాళి కట్టనీవా
మనసు తెలుసుకుని మరులు చూపితే
మనువునాడనిస్తా ఓ నరహరి
మనువునాడనిస్తా ఓ నరహరి
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment