Song » Ningiki Jabili Andam / నింగికి జాబిలి అందం
Song Details:Actor :
Abbas / అబ్బాస్ ,
Madhan / మధన్ ,Actress :
Rema sen / రీమా సేన్ ,Music Director :
Harris Jairaj / హారీస్ జైరాజ్ ,Lyrics Writer :
Bhuvana Chandra / భువన చంద్ర ,Singer :
Harini / హరిణి ,
Unni Krishnan / ఉన్నికృష్ణన్ ,Song Category : Love & Romantic Songs
pallavi: niMgiki jAbili aMdaM nElaki tolakari aMdaM nIkanucUpulu sOkaTamE AnaMdaM bommA borusula caMdaM viDipOnidi mana baMdhaM kammani kalala gOpuramE anubaMdhaM.. anubaMdhaM.. O O maunaM maunaM maunaM mAnavA prANamA mATistE prANaM nIkE ivvanA nEstamA itaDevarO itaDevarO vaccinadeMdukanO nA venakE vaccADu dEnini kOrukunO emaiMdO nAkE teliyadulE guMDellO gubulu taragadulE are EmiTilA eMdukilA taDabaDi pOtunnA idi valapu kathO vayasu vyadhO teliyaka niMcunnA ||itaDevarO|| caraNaM 1: vayasuni taTTi manasuni paTTE muddula jAbilli pOkE celiyA nannodili navvulu ruvvi puvvulu ruvvi ADake dIvAli cevilO pADake kavvAli manasA manasA ninnU madilO dAcinadevarO..O.. nA yadalOnE uMTU nannE dOcinavArE vArevarO vArevarO vaccinadeMdukanO yadalOnE yadalOnE dAginadeMdukanO emaiMdO nAkE teliyadule guMDellO gubulu taragadulE are EmiTilA eMdukilA taDabaDi pOtunnA idi valapu kathO vayasu vyadhO teliyaka niMcunnA are tikamaka paDutunnA.. caraNaM 2: sogasari guvva sOgasari guvva taDabATeMdulakE talapula dAhaM tIrcavaTE manasunu mOhaM kammuku vastE maunaM vIDavaTe madanuDi sAyaM kOravaTE EmO EmO nannU EdO cEsAvulE..E.. nEnu nIku cEsiMdEdO nuvvE nAku cesAvE bommA nIvevarO nIvevarO occinadeMdukanO nAvenakE paDDAvu... U~MhU~MhU~M.. nEnElE nIkOsaM vaccA manasArA nA edani nIkOsaM paricA priyamArA emaiMdO nAkE teliyadulE nAmanasu ninnE vIDadulE are eMdukilA eMdukilA jarigene prANasaKi idi valapu kathO vayasu vyadhO telupavE caMdramuKi katha telupavE caMdramuKI katha telupavE caMdramuKI katha telupavE caMdramuKI caMdramuKI caMdramuKI caMdramuKI.. Click here to hear the song
పల్లవి: నింగికి జాబిలి అందం నేలకి తొలకరి అందం నీకనుచూపులు సోకటమే ఆనందం బొమ్మా బొరుసుల చందం విడిపోనిది మన బంధం కమ్మని కలల గోపురమే అనుబంధం.. అనుబంధం.. ఓ ఓ మౌనం మౌనం మౌనం మానవా ప్రాణమా మాటిస్తే ప్రాణం నీకే ఇవ్వనా నేస్తమా ఇతడెవరో ఇతడెవరో వచ్చినదెందుకనో నా వెనకే వచ్చాడు దేనిని కోరుకునో ఎమైందో నాకే తెలియదులే గుండెల్లో గుబులు తరగదులే అరె ఏమిటిలా ఎందుకిలా తడబడి పోతున్నా ఇది వలపు కథో వయసు వ్యధో తెలియక నించున్నా ||ఇతడెవరో|| చరణం 1: వయసుని తట్టి మనసుని పట్టే ముద్దుల జాబిల్లి పోకే చెలియా నన్నొదిలి నవ్వులు రువ్వి పువ్వులు రువ్వి ఆడకె దీవాలి చెవిలో పాడకె కవ్వాలి మనసా మనసా నిన్నూ మదిలో దాచినదెవరో..ఓ.. నా యదలోనే ఉంటూ నన్నే దోచినవారే వారెవరో వారెవరో వచ్చినదెందుకనో యదలోనే యదలోనే దాగినదెందుకనో ఎమైందో నాకే తెలియదులె గుండెల్లో గుబులు తరగదులే అరె ఏమిటిలా ఎందుకిలా తడబడి పోతున్నా ఇది వలపు కథో వయసు వ్యధో తెలియక నించున్నా అరె తికమక పడుతున్నా.. చరణం 2: సొగసరి గువ్వ సోగసరి గువ్వ తడబాటెందులకే తలపుల దాహం తీర్చవటే మనసును మోహం కమ్ముకు వస్తే మౌనం వీడవటె మదనుడి సాయం కోరవటే ఏమో ఏమో నన్నూ ఏదో చేసావులే..ఏ.. నేను నీకు చేసిందేదో నువ్వే నాకు చెసావే బొమ్మా నీవెవరో నీవెవరో ఒచ్చినదెందుకనో నావెనకే పడ్డావు... ఊఁహూఁహూఁ.. నేనేలే నీకోసం వచ్చా మనసారా నా ఎదని నీకోసం పరిచా ప్రియమారా ఎమైందో నాకే తెలియదులే నామనసు నిన్నే వీడదులే అరె ఎందుకిలా ఎందుకిలా జరిగెనె ప్రాణసఖి ఇది వలపు కథో వయసు వ్యధో తెలుపవే చంద్రముఖి కథ తెలుపవే చంద్రముఖీ కథ తెలుపవే చంద్రముఖీ కథ తెలుపవే చంద్రముఖీ చంద్రముఖీ చంద్రముఖీ చంద్రముఖీ.. ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment