Song » Ennenno Andalu / ఎన్నెన్నో అందాలు
Song Details:Actor :
Venkatesh / వెంకటేష్ ,Actress :
Meena / మీనా ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
ennennO aMdaalu EvEvO raagaalu vEsE pUla baaNaM kUsE gaali gaMdhaM poddElEni aakaashaM haddElEni aanaMdaM ennennO aMdaalu EvEvO raagaalu sirigala cilakalu iladigi naDacuTa nyaayamaa dharmamaa tolakari merupulu cilikina cinukulu niMgilO aagunaa calimara gadulalO suKapaDu batukulu vEsavE kOrunaa alikuna guDisela caluvula manasulu mEDalO dorukunaa aMdaala mEDallOnE aMTadu kaaliki mannu baMgaaru paMTalu paMDE mannuku caaladu minnu nirupEdillu podarillu ilalO unna harivillu ennennO aMdaalu EvEvO raagaalu vEsE pUla baaNaM kUsE gaali gaMdhaM poddElEni aakaashaM haddElEni aanaMdaM ennennO aMdaalu EvEvO raagaalu jalajala padamula alajaDi nadulaku vaMta nE paaDanaa milamila merisina taLataLa taaralu niMginE vIDunaa ceruvula kaDupuna virisina taamara tEnelE pUyunaa miNuguru purugula miDimiDi velugulu vennelai kaayunaa E gaali mEDallOnO dIpaMlaa nE unnaa maa palle siMgaaraalu nIlO nEnE kannaa gOdaaramma paravaLLu telugiMTamma tirunaaLLu ennennO aMdaalu EvEvO raagaalu vEsE pUla baaNaM kUsE gaali gaMdhaM poddElEni aakaashaM haddElEni aanaMdaM ennennO aMdaalu EvEvO raagaalu Click here to hear the song
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం కూసే గాలి గంధం పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు సిరిగల చిలకలు ఇలదిగి నడచుట న్యాయమా ధర్మమా తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా అలికున గుడిసెల చలువుల మనసులు మేడలో దొరుకునా అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను బంగారు పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను నిరుపేదిల్లు పొదరిల్లు ఇలలో ఉన్న హరివిల్లు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం కూసే గాలి గంధం పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు జలజల పదముల అలజడి నదులకు వంత నే పాడనా మిలమిల మెరిసిన తళతళ తారలు నింగినే వీడునా చెరువుల కడుపున విరిసిన తామర తేనెలే పూయునా మిణుగురు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలై కాయునా ఏ గాలి మేడల్లోనో దీపంలా నే ఉన్నా మా పల్లె సింగారాలు నీలో నేనే కన్నా గోదారమ్మ పరవళ్ళు తెలుగింటమ్మ తిరునాళ్ళు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం కూసే గాలి గంధం పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment