Tuesday, July 21, 2020

Chandralekha » Urumulu Ni Muvvalai      చంద్రలేఖ » ఉరుములు నీ మువ్వలై

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Urumulu Ni Muvvalai / ఉరుములు నీ మువ్వలై
Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Isha Kopikkhar / ఇషా కొపికర్ ,  Ramya krishna / రమ్యకృష్ణ  ,Music Director : Sandeep Chowta / సందీప్ చౌతా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Rajesh / రాజేశ్ ,  Sujatha / సుజాత ,Song Category : Inspiring & Motivational Songs
urumulu nI muvvalai merupulu nI navvulai
tolakari mEGaanivai raa alivENi
parugulu nI gaanamai taragalu nI taaLamai
cilipigaa ciMdaaDavE kinnerasaani
kaalaanikE kaalaaDaka aagaali nuvvu aaDE vELa
adi cUDagaa manasaagaka aaDaali nItO niMgi nEla
takadhimi taaLaalapai taLukula taraMgamai
cilipigaa ciMdaaDavE kinnerasaani
melikala maMdaakini kulukula bRuMdaavani
kanulaku viMdiyyavE aa aMdaanni



caMdrullO kuMdElE maa iMTa uMdaMTU murisiMdi I muMgili
ciMdaaDE kiraNaMlaa maa muMdu nuvvuMTE pratipUTa dIpaavaLi
maa kaLLalO veligiMcavE sirivennela
maa aashalai nI aMdelai I maMcu maunaM mOgE vELa
aa saMdaDE aanaMdamai prEmiMcu praaNaM paaDE vELa



urumulu nI muvvalai merupulu nI navvulai
tolakari mEGaanivai raa alivENi
takadhimi taaLaalapai taLukula taraMgamai
cilipigaa ciMdaaDavE kinnerasaani



naDayaaDE nI paadaM naTavEdamEnaMTU I puDamE pulakiMcagaa
nI pedavE tana kOsaM anuvaina koluvaMTU saMgItaM ninu cEragaa
maa guMDenE shRuti cEyavaa nI vINalaa
I gaalilO nI kELitO raagaalu ennO rEgE vELa
nI mEnilO harivillunE varNaala vaanai saagE vELa



urumulu nI muvvalai merupulu nI navvulai
tolakari mEGaanivai raa alivENi
takadhimi taaLaalapai taLukula taraMgamai
cilipigaa ciMdaaDavE kinnerasaani






 
 Click here to hear the song
ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి
పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై
చిలిపిగా చిందాడవే కిన్నెరసాని
కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ
అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల
తకధిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగా చిందాడవే కిన్నెరసాని
మెలికల మందాకిని కులుకుల బృందావని
కనులకు విందియ్యవే ఆ అందాన్ని



చంద్రుల్లో కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి
చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతిపూట దీపావళి
మా కళ్ళలో వెలిగించవే సిరివెన్నెల
మా ఆశలై నీ అందెలై ఈ మంచు మౌనం మోగే వేళ
ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళ



ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి
తకధిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగా చిందాడవే కిన్నెరసాని



నడయాడే నీ పాదం నటవేదమేనంటూ ఈ పుడమే పులకించగా
నీ పెదవే తన కోసం అనువైన కొలువంటూ సంగీతం నిను చేరగా
మా గుండెనే శృతి చేయవా నీ వీణలా
ఈ గాలిలో నీ కేళితో రాగాలు ఎన్నో రేగే వేళ
నీ మేనిలో హరివిల్లునే వర్ణాల వానై సాగే వేళ



ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి
తకధిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగా చిందాడవే కిన్నెరసాని
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment