Tuesday, July 21, 2020

Chakram » Rangeli Holi      చక్రం » రంగేళి హోలీ

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Rangeli Holi / రంగేళి హోలీ

Song Details:Actor : Prabhas / ప్రభాస్ ,Actress : Asin / ఆసిన్ ,Music Director : Chakri / చక్రి  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,Song Category : Others
kRuShNa kRuShNa kRuShNA...

hE rAma rAma rAmA

cinnA peddA aMtA    

jam cikacika jam 2 hOy...

paMDuga cEyyalaMTA 

jam cikacika jam 2 hOy...

tIpi cEdu aMtA

jam cikacika jam 2 hOy...

paMci peTTalaMTU

jam cikacika jam 2 hOy...
pallavi:

hEy raMgELi hOlI raMgA mArkElI

ekkaDa nuvvuMTE akkaDa jaragAli

ravvala riMgucOlI siridivvela dIvALI

eppuDu rammaMTE appuDu rAvAli

paMcAMgaM cebitEgAni paMDuga rAnaMdA

saMtOShaMgA gaDapaDAnikO sumuhurtaM uMTuMdA

jIM tanakatha takathimi jiM tanaktha 2  raMgELi hOlI
caraNaM:

tinEdi cEdani telisi adi ugAdi viMdani talaci

iShTapaDE A pUTE alavATaitE... pratirOju vasaMtamavutuMdi

gaDapalu anni jaripi A gaNapati paMDuga jaripi

nimajjanaM kAni janaM jaripE payanaM

nitya BAdrapadaM avutuMdi

 lOkulu cIkaTi tolagiMcE SuBasamayaM kOsaM vetikE

cUpulu dIpAlugA cEsE... jAgaraNE... SivarAtri

pratyEkaMgA baMdhuvulocce rOju okaTuMDalA

cuTTU iMdaru cuTTAluMTE saMdaDigAlEdA  raMgELi hOlI
caraNaM:

kannula jOlapadAlai kollalA jAnapadalai

naruDiki gIta padamai naDavaDamaMTE... arthaM kRuShNajayaMti...

aMdari eMDaku manamE paMdirayyE kShaNamE

maMcitanaM aMTArani gurtiMcaDamE.. SrIrAmanavamayyiMdi

manalO manamE kalahiMci... manalO maniShini talatuMci

vijayaM sAdhiMcE kShaNamE dasarA... daSami... avutuMdi

paduguru paMcina veccani Upiri BOgimaMTaiMdi

madi muMgililO muggulu vEsE SAMtE saMkrAMti

gobbiyalO... gobbiyallO ...2

okaTi reMDu aMTU viDigA lekkaDitE

tommidi gummaM dATavu eppuDu aMkelu ennaMTE

pakkana nilabeDutU kalupukupOtuMTE...

lekkalakainA lekkalakaMdavu saMKyalu ennaMTE hE....

nuvvunuvvugA nEnu nEnugA unnAmanukuMTE

kOTla okkaTai evari musugulO vALLu unnAmaMtE

ninnu nannu kalipi manamani anukunnAmaMTE

prapaMcajanABA mottaM kalipitE maniShitanaM okkaTE

maniShitanaM okkaTE...
 
Click here to hear the song
కృష్ణ కృష్ణ కృష్ణా...

హే రామ రామ రామా

చిన్నా పెద్దా అంతా    

జమ్ చికచిక జమ్ 2 హోయ్...

పండుగ చేయ్యలంటా 

జమ్ చికచిక జమ్ 2 హోయ్...

తీపి చేదు అంతా

జమ్ చికచిక జమ్ 2 హోయ్...

పంచి పెట్టలంటూ

జమ్ చికచిక జమ్ 2 హోయ్...
పల్లవి:

హేయ్ రంగేళి హోలీ రంగా మార్కేలీ

ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి

రవ్వల రింగుచోలీ సిరిదివ్వెల దీవాళీ

ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి

పంచాంగం చెబితేగాని పండుగ రానందా

సంతోషంగా గడపడానికో సుముహుర్తం ఉంటుందా

జీం తనకథ తకథిమి జిం తనక్థ 2  రంగేళి హోలీ
చరణం:

తినేది చేదని తెలిసి అది ఉగాది విందని తలచి

ఇష్టపడే ఆ పూటే అలవాటైతే... ప్రతిరోజు వసంతమవుతుంది

గడపలు అన్ని జరిపి ఆ గణపతి పండుగ జరిపి

నిమజ్జనం కాని జనం జరిపే పయనం

నిత్య భాద్రపదం అవుతుంది

 లోకులు చీకటి తొలగించే శుభసమయం కోసం వెతికే

చూపులు దీపాలుగా చేసే... జాగరణే... శివరాత్రి

ప్రత్యేకంగా బంధువులొచ్చె రోజు ఒకటుండలా

చుట్టూ ఇందరు చుట్టాలుంటే సందడిగాలేదా  రంగేళి హోలీ
చరణం:

కన్నుల జోలపదాలై కొల్లలా జానపదలై

నరుడికి గీత పదమై నడవడమంటే... అర్థం కృష్ణజయంతి...

అందరి ఎండకు మనమే పందిరయ్యే క్షణమే

మంచితనం అంటారని గుర్తించడమే.. శ్రీరామనవమయ్యింది

మనలో మనమే కలహించి... మనలో మనిషిని తలతుంచి

విజయం సాధించే క్షణమే దసరా... దశమి... అవుతుంది

పదుగురు పంచిన వెచ్చని ఊపిరి భోగిమంటైంది

మది ముంగిలిలో ముగ్గులు వేసే శాంతే సంక్రాంతి

గొబ్బియలో... గొబ్బియల్లో ...2

ఒకటి రెండు అంటూ విడిగా లెక్కడితే

తొమ్మిది గుమ్మం దాటవు ఎప్పుడు అంకెలు ఎన్నంటే

పక్కన నిలబెడుతూ కలుపుకుపోతుంటే...

లెక్కలకైనా లెక్కలకందవు సంఖ్యలు ఎన్నంటే హే....

నువ్వునువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే

కోట్ల ఒక్కటై ఎవరి ముసుగులో వాళ్ళు ఉన్నామంతే

నిన్ను నన్ను కలిపి మనమని అనుకున్నామంటే

ప్రపంచజనాభా మొత్తం కలిపితే మనిషితనం ఒక్కటే

మనిషితనం ఒక్కటే...
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment