Song » Oho chakkani chinnadi / ఓహో చక్కని చిన్నదీ
Song Details:Actor :
Padmanabham / పద్మనాభం ,Actress :
E.V. Saroja / ఇ.వి. సరోజ ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Ashalatha Kulakarni / ఆశాలతా కులకర్ణి ,
P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,Song Category : Love & Romantic Songs
aanand : oho chakkani chinnadi - vayyarangaa vunnadi oorincheTi kannulatho nanne choodannadi latha : chinnadi chaala manchidi - ninne nammukunnadi neeve tappa verevaroo lene lerannadi aanand : vechha ga javvani taakithe, pichhi ga voohalu regune reparepalaaDe gundela lona - prema nindene latha : ayyo paapam ! aanand : teerani taapam ! latha : bhaava kavitvam chaalunoyi - paithyam lona jaarakoyi pelliki mundu pranayaalu mulla baanaalu ||oho|| latha : peddala anumathi teesuko premanu sontham chesuko haddoo paddoo meerinaavo - aata kattenu aanand : 'yassan'Taaru maavaallu latha : 'no' antenu thaka raaru aanand : thallee dandri koodadante - gullo pelli chesukundaam dhairyam chesi neevegaa daari choopaavu ||chinnadi|| aanand : manase dochina sundari - mamate malle pandiri pandirilona menulu marachi paravasinchaali latha : apude kaadu aanand : epuDantaavu latha : thondaralone moodu muLLoo andari mundoo veyagaane thodoo needai kalakaalam saagipodaamu aanand : oho chakkani chinnadi - vayyarangaa vunnadi oorincheTi kannulatho nanne choodannadi latha : chinnadi chaala manchidi - ninne nammukunnadi neeve tappa verevaroo lene lerannadi iddaroo : o o o o... aa aa aa aa.. Click here to hear the song
ఆనంద్ : ఒహో చక్కని చిన్నది - వయ్యారంగా ఉన్నది ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది లత : చిన్నది చాలా మంచిది - నిన్నే నమ్ముకున్నది నీవే తప్ప వేరెవరూ లేనే లేరన్నది ఆనంద్ : వెచ్చ గ జవ్వని తాకితే, పిచ్చి గ వూహలు రేగునే రెపరెపలాడె గుండెల లోన - ప్రేమ నిండెనే లత : అయ్యో పాపం ! ఆనంద్ : తీరని తాపం ! లత : భావ కవిత్వం చాలునోయీ - పైత్యం లోన జారకోయి పెళ్ళికి ముందు ప్రణయాలు ముళ్ళ బాణాలు ||ఒహో|| లత : పెద్దల అనుమతి తీసుకో ప్రేమను సొంతం చేసుకో హద్దూ పద్దూ మీరినావొ - ఆట కట్టెను ఆనంద్ : 'యాస్సాం'టారు మావాళ్లు లత : 'నో' అంటేను తక రారు ఆనంద్ : తల్లీ దండ్రి కూడదంటే - గుళ్ళో పెళ్లి చేసుకుందాం ధైర్యం చేసి నీవేగా దారి చూపావు ||చిన్నది|| ఆనంద్ : మనసే దోచిన సుందరి - మమతే మల్లె పందిరి పందిరిలోన మేనులు మరచి పరవశించాలి లత : అపుడే కాదు ఆనంద్ : ఎపుదంటావు లత : తొందరలొనే మూడు ముళ్ళూ అందరి ముందూ వేయగానే తోడూ నీడై కలకాలం సాగిపోదాము ఆనంద్ : ఒహో చక్కని చిన్నది - వయ్యారంగా ఉన్నది ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది లత : చిన్నది చాలా మంచిది - నిన్నే నమ్ముకున్నది నీవే తప్ప వేరెవరూ లేనే లేరన్నది ఇద్దరూ : ఓ ఓ ఓ ఓ... ఆ ఆ ఆ ఆ.. ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment