
Song » Taladinchuku / తలదించుకు
Song Details:Actor :
Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress :
Tamanna / తమన్నా ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer :
Hema chandra / హేమచంద్ర ,
Karunya / కారుణ్య ,
Sri Krishna / శ్రీ కృష్ణ ,Song Category : Others
pallavi:1 taladiMcuku batukutAva tala^^ettuku tiragalEva talarAtanu mArcukOva... sigganEdi lEdA? okaDiga nuvu puTTalEda okaDiga nuvu caccipOva okaDiga pOrADalEva... nidralEci rArA nI OTuni nI vETuke vADutuMTe viMtagA juTTupaTTi raccakIDci niladIyavanErugA? uDukettina netture oka nippuTErulAga kadalirA...kadalirA...kadalirA panaipOddi...panaipOddi..panaipOddi ...rArA caraNaM:1 nI iMTi cUruvirigi mIdapaDaka muMdE nI guMDela cappuDu ninu CI koTTakamuMdE kadalrA....kadalrA...kadalrA...orEy dEhAniki hAni aMTe vaidyamiccukOvA dESAnike jabbucEste nILLunamulutAvA kadalrA....kadalrA...kadalrA...orEy panaipOddi...panaipOddi..panaipOddi ...rArA pallavi:2 toli maniShepuDokkaDEga toli aDugepuDoMTarEga tudipOruku siddhamaina... tolivADiga rArA bigabaTTina piDikilayyi pOTettina saMdramayyi naDinettina sUryuDayyi....udyamiMcilErA pOrADani prANamuMTe adi prAName kAdaTA UpirinE olakabOsi egareyyara bAvuTA kaNakaNakaNa pratikaNamuna janagaNamana gItamayyi kadalirA...kadalirA...kadalirA panaipOddi...panaipOddi..panaipOddi ...rArA
పల్లవి:1 తలదించుకు బతుకుతావ తలఎత్తుకు తిరగలేవ తలరాతను మార్చుకోవ... సిగ్గనేది లేదా? ఒకడిగ నువు పుట్టలేద ఒకడిగ నువు చచ్చిపోవ ఒకడిగ పోరాడలేవ... నిద్రలేచి రారా నీ ఓటుని నీ వేటుకె వాడుతుంటె వింతగా జుట్టుపట్టి రచ్చకీడ్చి నిలదీయవనేరుగా? ఉడుకెత్తిన నెత్తురె ఒక నిప్పుటేరులాగ కదలిరా...కదలిరా...కదలిరా పనైపోద్ది...పనైపోద్ది..పనైపోద్ది ...రారా చరణం:1 నీ ఇంటి చూరువిరిగి మీదపడక ముందే నీ గుండెల చప్పుడు నిను ఛీ కొట్టకముందే కదల్రా....కదల్రా...కదల్రా...ఒరేయ్ దేహానికి హాని అంటె వైద్యమిచ్చుకోవా దేశానికె జబ్బుచేస్తె నీళ్ళునములుతావా కదల్రా....కదల్రా...కదల్రా...ఒరేయ్ పనైపోద్ది...పనైపోద్ది..పనైపోద్ది ...రారా పల్లవి:2 తొలి మనిషెపుడొక్కడేగ తొలి అడుగెపుడొంటరేగ తుదిపోరుకు సిద్ధమైన... తొలివాడిగ రారా బిగబట్టిన పిడికిలయ్యి పోటెత్తిన సంద్రమయ్యి నడినెత్తిన సూర్యుడయ్యి....ఉద్యమించిలేరా పోరాడని ప్రాణముంటె అది ప్రాణమె కాదటా ఊపిరినే ఒలకబోసి ఎగరెయ్యర బావుటా కణకణకణ ప్రతికణమున జనగణమన గీతమయ్యి కదలిరా...కదలిరా...కదలిరా పనైపోద్ది...పనైపోద్ది..పనైపోద్ది ...రారా
0 comments:
Post a Comment