Tuesday, July 7, 2020

Buddhimanthudu » Gutta meda guvva బుద్ధిమంతుడు » గుట్ట మీద గువ్వ

July 07, 2020 Posted by Publisher , No comments

Song » Gutta meda guvva / గుట్ట మీద గువ్వ
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Vijayanirmala / విజయనిర్మల ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P. Suribabu / పి. సూరిబాబు  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
guTTamIda guvva kUsiMdi

kaTTamIdakavuju  palikiMdi

guDilOna jEgaMTa mOgiMdi

nA guMDelO tolivalapu  paMDiMdi        ||guTTa||

nalla nallAni mabbu naDiciMdi

tellA tellAni   aMcu tOciMdi

canuvu   jalarEkulai   veligiMdi

callA callAni jallu kurisiMdi...              ||guTTa||

kommamIda vAli gOriMka

kamma  kammani UsulADiMdi

gOriMka tAniMka   gUDu  kaTTakapOte

kommA eMtO cinnabOtuMdi

kommA eMtO cinnabOtuMdi             ||guTTa||

sannagAjula ravaLi  piliciMdi

sannagAjula daMDa vEciMdi

manasaina  javarAlE  valaciMdi

manugaDE oka malupu tirigiMdi

manugaDE oka malupu tirigiMdi       ||guTTa||
గుట్టమీద గువ్వ కూసింది

కట్టమీదకవుజు  పలికింది

గుడిలోన జేగంట మోగింది

నా గుండెలో తొలివలపు  పండింది        ||గుట్ట||

నల్ల నల్లాని మబ్బు నడిచింది

తెల్లా తెల్లాని   అంచు తోచింది

చనువు   జలరేకులై   వెలిగింది

చల్లా చల్లాని జల్లు కురిసింది...              ||గుట్ట||

కొమ్మమీద వాలి గోరింక

కమ్మ  కమ్మని ఊసులాడింది

గోరింక తానింక   గూడు  కట్టకపోతె

కొమ్మా ఎంతో చిన్నబోతుంది

కొమ్మా ఎంతో చిన్నబోతుంది             ||గుట్ట||

సన్నగాజుల రవళి  పిలిచింది

సన్నగాజుల దండ వేచింది

మనసైన  జవరాలే  వలచింది

మనుగడే ఒక మలుపు తిరిగింది

మనుగడే ఒక మలుపు తిరిగింది       ||గుట్ట||

0 comments:

Post a Comment