Saturday, July 11, 2020

Buddhimanthudu » Badilo Emunde      బుద్ధిమంతుడు » బడిలో ఏముందీ

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Badilo Emunde / బడిలో ఏముందీ
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Vijayanirmala / విజయనిర్మల ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
mA:    jai SrImadramA ramaNa gOviMdO hAri... nAyanalArA!

    baDilO EmuMdI dEvuni guDilOnE vuMdi

    BaktI muktI kAvAlaMTE

    mAdhava sEva ceyyAlaMTE        ||baDi||

gO:    guDilO EmuMdI bAbU - baDilOnE uMdi

    Bukti Sakti kAvAlaMTE

    mAnava sEva ceyyAlaMTE        ||guDi||

gO:    dEvuDi pEriTa dOpiDi cEsE

    daLAruleMdarO perigArU

    mukti mattulO Baktula muMcI

    sarvaM BOMcEstunnArU

    nOrulEni A dEvuDu pApaM

    nOrugAri pOtunnADU            ||guDilO||

mA:    caduvula pEriTa gumAstAlanU - tayAru cEstU vunnAru

    praBuvullAgA bratikEvALLanu - bAnisaluga cEstunnAru

    udyOgAlaku vETalADamani - ULla paiki tOlEstunnAru

gO:    cadavaka pOtE maniShi rivvunA - caMdruni paiki

    egirE vADA ? gira gira tirigi vaccEvADA ?

mA:    dEvuDu callaga cUDakapOtE akkaDe

    gallaMtai pODA - AnavAlu cikkEvADA ?

mA:    caduvula sAraM hariyani

gO:    harikUDA cadavAlani

mA:    caduvula marmaM hariyani

gO:    A harikI guruvuMDAlanI

mA:    hariyE sarvasvammani

gO :     caduvE sarvasvammanI

mA:    hariBaktuDu prahlAduDu munupE ballaguddi ceppADu

gO:    A hariyE SrI kRuShNuDugA vaccI

    baDilO kUrcuni cadivADu

    yI baDilO kUrcuni cadivADu

    cadivADU cadivADU cadivADU


 
 
Click here to hear the song
మా:    జై శ్రీమద్రమా రమణ గోవిందో హారి... నాయనలారా!

    బడిలో ఏముందీ దేవుని గుడిలోనే వుంది

    భక్తీ ముక్తీ కావాలంటే

    మాధవ సేవ చెయ్యాలంటే        ||బడి||

గో:    గుడిలో ఏముందీ బాబూ - బడిలోనే ఉంది

    భుక్తి శక్తి కావాలంటే

    మానవ సేవ చెయ్యాలంటే        ||గుడి||

గో:    దేవుడి పేరిట దోపిడి చేసే

    దళారులెందరో పెరిగారూ

    ముక్తి మత్తులో భక్తుల ముంచీ

    సర్వం భోంచేస్తున్నారూ

    నోరులేని ఆ దేవుడు పాపం

    నోరుగారి పోతున్నాడూ            ||గుడిలో||

మా:    చదువుల పేరిట గుమాస్తాలనూ - తయారు చేస్తూ వున్నారు

    ప్రభువుల్లాగా బ్రతికేవాళ్ళను - బానిసలుగ చేస్తున్నారు

    ఉద్యోగాలకు వేటలాడమని - ఊళ్ల పైకి తోలేస్తున్నారు

గో:    చదవక పోతే మనిషి రివ్వునా - చంద్రుని పైకి

    ఎగిరే వాడా ? గిర గిర తిరిగి వచ్చేవాడా ?

మా:    దేవుడు చల్లగ చూడకపోతే అక్కడె

    గల్లంతై పోడా - ఆనవాలు చిక్కేవాడా ?

మా:    చదువుల సారం హరియని

గో:    హరికూడా చదవాలని

మా:    చదువుల మర్మం హరియని

గో:    ఆ హరికీ గురువుండాలనీ

మా:    హరియే సర్వస్వమ్మని

గో :     చదువే సర్వస్వమ్మనీ

మా:    హరిభక్తుడు ప్రహ్లాదుడు మునుపే బల్లగుద్ది చెప్పాడు

గో:    ఆ హరియే శ్రీ కృష్ణుడుగా వచ్చీ

    బడిలో కూర్చుని చదివాడు

    యీ బడిలో కూర్చుని చదివాడు

    చదివాడూ చదివాడూ చదివాడూ


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment