Song » Karulo Shikaru Kelle / కారులో షికారు కెళ్ళే
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :Music Director :
Master Venu / మాస్టర్ \tవేణు ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Others
kArulO ShikAru keLLE pAlabuggala pasiDi cAnA buggalamIda gulAbi raMgu elA vaccenO ceppagalavA ninnu miMcina kanneleMdarO maMDuTeMDalO mADutuMTE vAri buggala niggu nIku vacci cErenu telusukO kArulO ShikAru keLLE pAlabuggala pasiDi cAnA nilici vinu nI baDAyi cAlu telusukO I nijA nijAlu caluva rAti mEDalOna kulukutAvE kurradAnA mEDakaTTina caluvarAyi elA vaccenO ceppagalavA kaDupu kAlE kaShTajIvulu oDalu virici ganulu tolici cemaTa caluvanu cErci rALLanu pErcinAru telusukO kArulO ShikAru gAlilOnA tElipOyE cIrakaTTina cinnadAnA 2 jilugu velugula cIra SilpaM elA vaccenO ceppagalavA cirugu pAtala baruvu bratukula nEtagALLE nEsinAru cArirokaridi sauKyamokaridi sAgadiMka telusukO kArulO ShikAru Click here to hear the song
కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి చానా బుగ్గలమీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడుతుంటే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి చానా నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజా నిజాలు చలువ రాతి మేడలోన కులుకుతావే కుర్రదానా మేడకట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా కడుపు కాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి చెమట చలువను చేర్చి రాళ్ళను పేర్చినారు తెలుసుకో కారులో షికారు గాలిలోనా తేలిపోయే చీరకట్టిన చిన్నదానా 2 జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు చారిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో కారులో షికారు ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment