Tuesday, July 14, 2020

Bhukailas » Tagunaa varameya      భూకైలాస్ » తగునా వరమీయ

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Tagunaa varameya / తగునా వరమీయ
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,Music Director : Sudarshanam-Govardhanam / సుదర్శనం-గోవర్ధనం ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
tagunA varamIya 
I nIti dUrunaku, parama pAvunaku tagunA
snEhamu mIraga nIvElagA
drOhamu nE jEsiti snEhamu
pApa karmu durmadAMdhu nannu
vEpaka daya cUpitEla - hara tagunA
maMgaLadAyini, mAta pArvatini
matimAli mOhiMciti
kannulaniMcE SUlAla poDici
kAmamu mApumA kannula
tALajAlanu salipina GanapApa
saMtAna BaramEnika
cAlunU kaDatErcumu ikanaina
vIni puNyahIna durjanmamu
pOnADiti mati, vErEgati marilEdu
I nIcuni tala iMdE tunakalu gAnI
mEniyyeDa vasivADi mADi masimasi gAnI
pApamu bApumA, nI daya jUpumA
nI daya cUpumA
cEkonumA dEvA - Siramu
cEkonumAdEvA Siramu cEkonumA dEvA
Siramu cEkonumAdEvA
cEkonumA dEvA Siramu cEkonu mahAdEvA
mAlikalO maNigA nilupu -
kaMTha mAlikalO maNigA nilupu 3
nA pApa Baramu tarugu virugu cEkonumA



Click here to hear the song
తగునా వరమీయ 
ఈ నీతి దూరునకు, పరమ పావునకు తగునా
స్నేహము మీరగ నీవేలగా
ద్రోహము నే జేసితి స్నేహము
పాప కర్ము దుర్మదాంధు నన్ను
వేపక దయ చూపితేల - హర తగునా
మంగళదాయిని, మాత పార్వతిని
మతిమాలి మోహించితి
కన్నులనించే శూలాల పొడిచి
కామము మాపుమా కన్నుల
తాళజాలను సలిపిన ఘనపాప
సంతాన భరమేనిక
చాలునూ కడతేర్చుము ఇకనైన
వీని పుణ్యహీన దుర్జన్మము
పోనాడితి మతి, వేరేగతి మరిలేదు
ఈ నీచుని తల ఇందే తునకలు గానీ
మేనియ్యెడ వసివాడి మాడి మసిమసి గానీ
పాపము బాపుమా, నీ దయ జూపుమా
నీ దయ చూపుమా
చేకొనుమా దేవా - శిరము
చేకొనుమాదేవా శిరము చేకొనుమా దేవా
శిరము చేకొనుమాదేవా
చేకొనుమా దేవా శిరము చేకొను మహాదేవా
మాలికలో మణిగా నిలుపు -
కంఠ మాలికలో మణిగా నిలుపు 3
నా పాప భరము తరుగు విరుగు చేకొనుమా
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment