Tuesday, July 14, 2020

Bhukailas » Ramuni avataram      భూకైలాస్ » రాముని అవతారం

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Ramuni avataram / రాముని అవతారం
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,Music Director : Sudarshanam-Govardhanam / సుదర్శనం-గోవర్ధనం ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Devotional Songs
dvaarapaalura marala darideeyu kRpayO
 
dharalOna dharmamu nelakolpu nepamO
raamuni avataaraM
ravikula sOmuni avataaraM
 raamuni
sujana janaavana dharmaakaaraM
durjana hRdaya vidaaraM
 raamuni
daaSaradhiga SreekaaMtuDu velayu
kausalyaasati taphamu phaliMchu
janmiMturu sahajaatulu muvvuru 
janmiMturu
lakshmaNa Satrughna bharata 
raamuni'
chaduvulu naeruchu mishachaeta
chaapamu daalichi chaeta
viSvaamitruni venuveMTa
yaagamu kaavaga chanunaMTa
aMtamu chaeyunahalyaku Saapamu
 aMtamu
osagunu suMdara roopaM
 raamuni
dhanuvO janakuni manasuna bhayamO
dhaaruNi kanyaa saMSayamO
danujulu kalaganu sukhagOpuramO
 danujulu
virigenu midhilaa nagaramuna
 raamuni'
kapaTa naaTakuni paTTaabhishaekaM
kalugunu taatkaalikaa SOkaM
bheekara kaanana vaasaaraMbhaM
lOkOddharaNaku praaraMbhaM
bharatuni kOrika teeruchu kOsaM
paaduka losagae praemaavaeSaM
narajaatiki nava navasaMtOshaM 
 narajaatiki'
gurujana saevaku aadaeSaM
 raamuni
adigO chooDumu baMgaru jiMka
mannai chanunayyO laMka
haranayanaagni paraaMganavaMka
aDigina maraName nee jiMka
rammu rammu hae bhaagavatOttama
vaanara kula puMgava hanumaan^
 rammu
mudrika kaadidi bhuvana nidaanaM
 mudrika
jeevanmuktiki sOpaanaM jeevanmukti
raamaraama jaya raamaraama
jaya raamaraama raghukula sOmaa
seetaaSOka vinaaSanakaari
laMkaa vaibhava saMhaari
ayyO raavaNa bhaktaagraesara
amaraM baunika nee charita
samayunu parasatipai mamakaaraM
velayunu dharma vichaaraM 
raamuni
ద్వారపాలుర మరల దరిదీయు కృపయో
 ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో
రాముని అవతారం
రవికుల సోముని అవతారం
 రాముని
సుజన జనావన ధర్మాకారం
దుర్జన హృదయ విదారం
 రాముని
దాశరధిగ శ్రీకాంతుడు వెలయు
కౌసల్యాసతి తఫము ఫలించు
జన్మింతురు సహజాతులు మువ్వురు 
జన్మింతురు
లక్ష్మణ శత్రుఘ్న భరత 
రాముని'
చదువులు నేరుచు మిషచేత
చాపము దాలిచి చేత
విశ్వామిత్రుని వెనువెంట
యాగము కావగ చనునంట
అంతము చేయునహల్యకు శాపము
 అంతము
ఒసగును సుందర రూపం
 రాముని
ధనువో జనకుని మనసున భయమో
ధారుణి కన్యా సంశయమో
దనుజులు కలగను సుఖగోపురమో
 దనుజులు
విరిగెను మిధిలా నగరమున
 రాముని'
కపట నాటకుని పట్టాభిషేకం
కలుగును తాత్కాలికా శోకం
భీకర కానన వాసారంభం
లోకోద్ధరణకు ప్రారంభం
భరతుని కోరిక తీరుచు కోసం
పాదుక లొసగే ప్రేమావేశం
నరజాతికి నవ నవసంతోషం 
 నరజాతికి'
గురుజన సేవకు ఆదేశం
 రాముని
అదిగో చూడుము బంగరు జింక
మన్నై చనునయ్యో లంక
హరనయనాగ్ని పరాంగనవంక
అడిగిన మరణమె నీ జింక
రమ్ము రమ్ము హే భాగవతోత్తమ
వానర కుల పుంగవ హనుమాన్
 రమ్ము
ముద్రిక కాదిది భువన నిదానం
 ముద్రిక
జీవన్ముక్తికి సోపానం జీవన్ముక్తి
రామరామ జయ రామరామ
జయ రామరామ రఘుకుల సోమా
సీతాశోక వినాశనకారి
లంకా వైభవ సంహారి
అయ్యో రావణ భక్తాగ్రేసర
అమరం బౌనిక నీ చరిత
సమయును పరసతిపై మమకారం
వెలయును ధర్మ విచారం 
రాముని
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment