Tuesday, July 14, 2020

Bhukailas » Emenu mudunaalla      భూకైలాస్ » ఈమేను మూడునాళ్ళ

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Emenu mudunaalla / ఈమేను మూడునాళ్ళ
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,Music Director : Sudarshanam-Govardhanam / సుదర్శనం-గోవర్ధనం ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
ImEnu mUDunALLa muccaTErA - mitti
vennaMTi tirugutuMTe erugavErA
aMtalOnE mAnava iMta mArupElarA
aiSvarya dAsyaMbu mAnukOrA I mEnu
aracEta kailAsa marayaneMtO - iha
sauKyAlu manasAra jUraneMtO ara'
dharayella ElagA ASalElA 2
yama kiMkarulu kAcukuMTe kAnavErA I mEnu
atyASa mAnavuni SatRuvaMTa - tyAga
jIvaname vIDipOni mitramaMTa atyASa
SaraNanna kanupiMcu dEvuDaMTa 2
tana kiMkarula cEviDaka kAcunaMTa I mEnu
ఈమేను మూడునాళ్ళ ముచ్చటేరా - మిత్తి
వెన్నంటి తిరుగుతుంటె ఎరుగవేరా
అంతలోనే మానవ ఇంత మారుపేలరా
ఐశ్వర్య దాస్యంబు మానుకోరా ఈ మేను
అరచేత కైలాస మరయనెంతో - ఇహ
సౌఖ్యాలు మనసార జూరనెంతో అర'
ధరయెల్ల ఏలగా ఆశలేలా 2
యమ కింకరులు కాచుకుంటె కానవేరా ఈ మేను
అత్యాశ మానవుని శతృవంట - త్యాగ
జీవనమె వీడిపోని మిత్రమంట అత్యాశ
శరణన్న కనుపించు దేవుడంట 2
తన కింకరుల చేవిడక కాచునంట ఈ మేను

0 comments:

Post a Comment