Friday, July 17, 2020

Bhoomikosam » Yevaro Vastharani      భూమికోసం » ఎవరో వస్తారని

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Yevaro Vastharani / ఎవరో వస్తారని

Song Details:Actor : Jaggayya / జగ్గయ్య ,Actress : Jamuna / జమున ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Sri sri / శ్రీ శ్రీ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
evarO vastArani EdO cEstArani

eduru cUsi mOsapOkumA

nijaM maraci nidurapOkumA
baDulE lEni palleTULLalO

baDulE lEni palleTULLalO

caduvE rAni pillalaku

caduvu rAni caduvula baDilO

jItAlu rAni paMtuLLaku

evarO tODu vastArani EdO mElu cEstArani

eduru cUsi mOsapOkumA
cAlI cAlani pUri guDiselO

cAlI cAlani pUri guDiselO

kAlE kaDupula pEdalaku

maMdulu lEni AsupatrilO

paDigApulu paDu rOgulaku

evarO tODu vastArani EdO mElu cEstArani

eduru cUsi mOsapOkumA
taratarAlugA mUDhAcArapu 

valalO cikkina vanitalaku

aj~jAnAniki anyAyAniki

bali ayipOyina paDatulaku

evarO tODu vastArani EdO mElu cEstArani

eduru cUsi mOsapOkumA
kUli DabbutO lATarI TikeT

lATarI TikeT

kUli DabbutO lATarI TikeT

konE durASA jIvulaku

duralavATlatO bAdhyata marici

ceDE nirASA jIvulaku

evarO tODu vastArani EdO mElu cEstArani

eduru cUsi mOsapOkumA
sEdyaM lEni bIDu nElalO

sEdyaM lEni bIDu nElalO

panulE lEni prANulaku

pagalu rEyi Srama paDutunnA

PalitaM dakkani dInulaku

evarO tODu vastArani EdO mElu cEstArani

eduru cUsi mOsapOkumA
 
 
Click here to hear the song
ఎవరో వస్తారని ఏదో చేస్తారని

ఎదురు చూసి మోసపోకుమా

నిజం మరచి నిదురపోకుమా
బడులే లేని పల్లెటూళ్ళలో

బడులే లేని పల్లెటూళ్ళలో

చదువే రాని పిల్లలకు

చదువు రాని చదువుల బడిలో

జీతాలు రాని పంతుళ్ళకు

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని

ఎదురు చూసి మోసపోకుమా
చాలీ చాలని పూరి గుడిసెలో

చాలీ చాలని పూరి గుడిసెలో

కాలే కడుపుల పేదలకు

మందులు లేని ఆసుపత్రిలో

పడిగాపులు పడు రోగులకు

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని

ఎదురు చూసి మోసపోకుమా
తరతరాలుగా మూఢాచారపు 

వలలో చిక్కిన వనితలకు

అజ్ఞానానికి అన్యాయానికి

బలి అయిపోయిన పడతులకు

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని

ఎదురు చూసి మోసపోకుమా
కూలి డబ్బుతో లాటరీ టికెట్

లాటరీ టికెట్

కూలి డబ్బుతో లాటరీ టికెట్

కొనే దురాశా జీవులకు

దురలవాట్లతో బాధ్యత మరిచి

చెడే నిరాశా జీవులకు

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని

ఎదురు చూసి మోసపోకుమా
సేద్యం లేని బీడు నేలలో

సేద్యం లేని బీడు నేలలో

పనులే లేని ప్రాణులకు

పగలు రేయి శ్రమ పడుతున్నా

ఫలితం దక్కని దీనులకు

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని

ఎదురు చూసి మోసపోకుమా
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment