Monday, July 6, 2020

Bharya biddalu » Chal Mohanarangaa భార్యాబిడ్డలు » చల్ మోహనరంగా

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Chal Mohanarangaa / చల్ మోహనరంగా
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  Actress : Jaya Lalitha / జయలలిత Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : Ghantasala / ఘంటసాల  Song Category : Others
pallavi :

 O O O... chal mOhanaraMgaa

 O... chal chal mOhanraMgaa

IIchalII

 rekkalochchi rivvurivvuna egiripOvaali

 naa raaNi kaugiTa jivvujivvuna karigipOvaali

 karuvu teeraali

 chal
 charaNaM : 1

 gaDapalOnae nilichi naaku edurostuMdi

 aa kachchibOtu kaLlatOnae miMgaestuMdi

gaDapalOnae

 EnnavaaNNi unnaTTae oDilO chaerchi

 oopiraaDani oosulennO chebutaanaMTuMdi

 chal
 charaNaM : 2

 pagalu iMkaa taragalaedani visugu paDutuMdi

 podduguMkaka muMdae deepaM veligistuMdi

pagalu

 paDakaTiMTi paalu taanae maraga kaastuMdi

 aa paalalO tana valapupaalu kalipaestuMdi

  chal
 charaNaM : 3

 talupu mooyakae gadilOkochchi bulipistuMdi

 naa tapana choosi chilipinavvu navvukuMTuMdi

talupu

 iMtasaepoo paDDa toMdara aemayyiMdO

 chaeyi paTTukuMTae chaaluleMDani beTTu chaestuMdi

  chal
పల్లవి :

 ఓ ఓ ఓ... చల్ మోహనరంగా

 ఓ... చల్ చల్ మోహన్రంగా

చల్

 రెక్కలొచ్చి రివ్వురివ్వున ఎగిరిపోవాలి

 నా రాణి కౌగిట జివ్వుజివ్వున కరిగిపోవాలి

 కరువు తీరాలి

చల్
 చరణం : 1

 గడపలోనే నిలిచి నాకు ఎదురొస్తుంది

 ఆ కచ్చిబోతు కళ్లతోనే మింగేస్తుంది

గడపలోనే

 ఉన్నవాణ్ణి ఉన్నట్టే ఒడిలో చేర్చి

 ఊపిరాడని ఊసులెన్నో చెబుతానంటుంది

చల్
 చరణం : 2

 పగలు ఇంకా తరగలేదని విసుగు పడుతుంది

 పొద్దుగుంకక ముందే దీపం వెలిగిస్తుంది

పగలు

 పడకటింటి పాలు తానే మరగ కాస్తుంది

 ఆ పాలలో తన వలపుపాలు కలిపేస్తుంది

చల్
 చరణం : 3

 తలుపు మూయకే గదిలోకొచ్చి బులిపిస్తుంది

 నా తపన చూసి చిలిపినవ్వు నవ్వుకుంటుంది

తలుపు

 ఇంతసేపూ పడ్డ తొందర ఏమయ్యిందో

 చేయి పట్టుకుంటే చాలులెండని బెట్టు చేస్తుంది

చల్

0 comments:

Post a Comment