Monday, July 13, 2020

Bhale Ramudu » Naa Bratukintenaa      భలే రాముడు » నా బ్రతుకింతేనా

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Naa Bratukintenaa / నా బ్రతుకింతేనా

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Sadasiva Brahmam / సదాశివ బ్రహ్మం ,Singer : P. Leela / పి. లీల ,Song Category : Others
nA bratukiMtEnA

nA jIvitamaMtA tIrani kannIrEnA

iMTiMTanu dIpAvaLi mA^^iMTiki lEdA - A BAgyamurAdA 2

kanipeMcina mA taMDri kanupiMcukapOyE

kanikAramiMtalEka tanadArini pOyE sOdari nanuviDipOye

manasAra valaci valapeMcina priyu DaTulAye manOharuDaTulAyE 2

iMTiMTanu dIpAvaLi mA^^iMTiki lEdA - A BAgyamurAdA 

sirini vadalEnADO cellAcedarAye



neranamminavAraMtA EkAkijEsipOye

koragAni bratukAye manasuvyAkulamAye

paritApamu mitimIri lOkamaMdhakAramAye

ipuDevvaru moravinuvArunnAru jagAna

kRupajUpeDuvAru akaTA lErokarainA

viparItamaina lOkamu nEnEmanudAnETulEmanudnA

iMTiMTanu dIpAvaLI mA iMTiki rAdA - A BAgyamurAdA


 
 
Click here to hear the song
నా బ్రతుకింతేనా

నా జీవితమంతా తీరని కన్నీరేనా

ఇంటింటను దీపావళి మాఇంటికి లేదా - ఆ భాగ్యమురాదా 2

కనిపెంచిన మా తండ్రి కనుపించుకపోయే

కనికారమింతలేక తనదారిని పోయే సోదరి ననువిడిపోయె

మనసార వలచి వలపెంచిన ప్రియు డటులాయె మనోహరుడటులాయే 2

ఇంటింటను దీపావళి మాఇంటికి లేదా - ఆ భాగ్యమురాదా 

సిరిని వదలేనాడో చెల్లాచెదరాయె



నెరనమ్మినవారంతా ఏకాకిజేసిపోయె

కొరగాని బ్రతుకాయె మనసువ్యాకులమాయె

పరితాపము మితిమీరి లోకమంధకారమాయె

ఇపుడెవ్వరు మొరవినువారున్నారు జగాన

కృపజూపెడువారు అకటా లేరొకరైనా

విపరీతమైన లోకము నేనేమనుదానేటులేమనుద్నా

ఇంటింటను దీపావళీ మా ఇంటికి రాదా - ఆ భాగ్యమురాదా


 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment