Monday, July 13, 2020

Bhale Ramudu » Bangaaru Bommaa      భలే రాముడు » బంగారు బొమ్మా

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Bangaaru Bommaa / బంగారు బొమ్మా
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Sadasiva Brahmam / సదాశివ బ్రహ్మం ,Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,  P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,Song Category : Others
padavE pOdAmU pai dESaM cUdAmu

baMgAru bommA balEjOrugA

padavE pOdAmU pai dESaM cUdAmu

Ame : paisA...paisA...paisA...paisA  ataDu: hU

Ame : paisA muMdu jUpistEnu pai saMgati cUdAmu

appuDu laMgarettivEdAM - appanamAmA O appanamAmA



ataDu : kalakattApOyi kArulekkudAM - boMbAyipOyi bOTu lekkudAM

kalakattApOyi kArulekkudAM - boMbAyipOyi bOTu lekkudAM

DhillI veLLI vimAnamekki - DhillI veLLI vimAnamekki

maLLI  tirigi mAnUroddAM baMgAru bommA



Ame: dArikarcuki dappikarcukI Dabbu daskaM tayArucEstE

dUradESamainA telladorala dESamainA

vastA paisA paisA

ataDu : paisAkEmI paravAlEdu DabbuMTE manakibbaMdilEdu

Ame : OhO

ataDu : unnapATuna kuripistAnu galagalagalagalA

Ame : EmiTi?

ataDu : kAsulu - rUkalu

unnapATuna kuripistAnu - tAtagAri sommu mana tAtagAri sommu

Ame : tAtagAri sommuMdani nAtO kOtalu kOstAvEM

mAmA kOtalu kOstAvEM

cEtikoccimATADavOyi - cEtikoccimATADavOyi

nItO vastA - ninu muripistA appanamAmA

ataDu : baMgAru bommA!

Ame : appanamAmA!

ataDu : bommA

Ame : mAmA


 
 
Click here to hear the song
అతడు : బంగారు బొమ్మా బలేజోరుగా

పదవే పోదామూ పై దేశం చూదాము

బంగారు బొమ్మా బలేజోరుగా

పదవే పోదామూ పై దేశం చూదాము

ఆమె : పైసా...పైసా...పైసా...పైసా  అతడు: హూ

ఆమె : పైసా ముందు జూపిస్తేను పై సంగతి చూదాము

అప్పుడు లంగరెత్తివేదాం - అప్పనమామా ఓ అప్పనమామా



అతడు : కలకత్తాపోయి కారులెక్కుదాం - బొంబాయిపోయి బోటు లెక్కుదాం

కలకత్తాపోయి కారులెక్కుదాం - బొంబాయిపోయి బోటు లెక్కుదాం

ఢిల్లీ వెళ్ళీ విమానమెక్కి - ఢిల్లీ వెళ్ళీ విమానమెక్కి

మళ్ళీ  తిరిగి మానూరొద్దాం బంగారు బొమ్మా



ఆమె: దారికర్చుకి దప్పికర్చుకీ డబ్బు దస్కం తయారుచేస్తే

దూరదేశమైనా తెల్లదొరల దేశమైనా

వస్తా పైసా పైసా

అతడు : పైసాకేమీ పరవాలేదు డబ్బుంటే మనకిబ్బందిలేదు

ఆమె : ఓహో

అతడు : ఉన్నపాటున కురిపిస్తాను గలగలగలగలా

ఆమె : ఏమిటి?

అతడు : కాసులు - రూకలు

ఉన్నపాటున కురిపిస్తాను - తాతగారి సొమ్ము మన తాతగారి సొమ్ము

ఆమె : తాతగారి సొమ్ముందని నాతో కోతలు కోస్తావేం

మామా కోతలు కోస్తావేం

చేతికొచ్చిమాటాడవోయి - చేతికొచ్చిమాటాడవోయి

నీతో వస్తా - నిను మురిపిస్తా అప్పనమామా

అతడు : బంగారు బొమ్మా!

ఆమె : అప్పనమామా!

అతడు : బొమ్మా

ఆమె : మామా


 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment