Song » Poojaku Velaayeraa! / పూజకు వేళాయెరా!
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Anjali devi / అంజలి దేవి ,Music Director :
P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi: pUjaku vELAyerA! raMga pUjaku vELAyerA 2 inninALLu nEneTula vEcitino ennirElu eMteMta vEgitino 2 piluvunu vini, viccEsitivani, nA valapulanni nI korake dAcitini 2 evarU poMdani EkAMtasEvalO IvELa tamidIragA ninne alariMcu pUja caraNaM: I nIlinIli muMgurulu iMdranIlAla maMjarulu I vikasita sitanayanAlu SatadaLa kOmala kamalAlu aruNAruNa mI adharamu taruNamaMdAra pallavamu edalO poMgina I ramaNIya payOdharAlu pAlakaDalilO udayiMcu sudhAkalaSAlu eMta suMdaramu, Silpa baMdhuramu I jaGana maMDalamu sRuShTinaMtaTini dAcukunna ApRudhvI maMDalamu O.... aBinava sauMdaryarASI! O.......apUrva cAturyamUrtI nI kaTAkShammula lAlanammulO nI kaTAkShammula lAlanammulO madhurimalennO podugukunnanI stanyasudhala AsvAdanammulO apramEyaM divvAnaMdAlanu aMdiMcE nI callani oDilO hAyigA niduriMca galigE pApagA nI kaDupuna janmiMcu BAgyamE lEdAye tallI.... tallI...tallI duvvukunna A nIlimuMgurule dUdipiMjalai pOvunulE! navvutunna A kaMTi velugulE divvela pOlika ArunulE! vanneloluku A ciguru pedavulE vADivattalai pOvunulE pAlupoMgu A kalaSAlE tOlutittulai pOvunulE naDumu vaMgagA nI oDalu kruMgagA naDumu vaMgagA nI oDalu kruMgagA naDuvalEni nI baDugu jIvitaM vaDavaDa vaNakunulE! ASalu rEpE suMdara dEhamu asti paMjarammaunulE! Click here to hear the song
పల్లవి: పూజకు వేళాయెరా! రంగ పూజకు వేళాయెరా 2 ఇన్నినాళ్ళు నేనెటుల వేచితినొ ఎన్నిరేలు ఎంతెంత వేగితినొ 2 పిలువును విని, విచ్చేసితివని, నా వలపులన్ని నీ కొరకె దాచితిని 2 ఎవరూ పొందని ఏకాంతసేవలో ఈవేళ తమిదీరగా నిన్నె అలరించు పూజ చరణం: ఈ నీలినీలి ముంగురులు ఇంద్రనీలాల మంజరులు ఈ వికసిత సితనయనాలు శతదళ కోమల కమలాలు అరుణారుణ మీ అధరము తరుణమందార పల్లవము ఎదలో పొంగిన ఈ రమణీయ పయోధరాలు పాలకడలిలో ఉదయించు సుధాకలశాలు ఎంత సుందరము, శిల్ప బంధురము ఈ జఘన మండలము సృష్టినంతటిని దాచుకున్న ఆపృధ్వీ మండలము ఓ.... అభినవ సౌందర్యరాశీ! ఓ.......అపూర్వ చాతుర్యమూర్తీ నీ కటాక్షమ్ముల లాలనమ్ములో నీ కటాక్షమ్ముల లాలనమ్ములో మధురిమలెన్నో పొదుగుకున్ననీ స్తన్యసుధల ఆస్వాదనమ్ములో అప్రమేయం దివ్వానందాలను అందించే నీ చల్లని ఒడిలో హాయిగా నిదురించ గలిగే పాపగా నీ కడుపున జన్మించు భాగ్యమే లేదాయె తల్లీ.... తల్లీ...తల్లీ దువ్వుకున్న ఆ నీలిముంగురులె దూదిపింజలై పోవునులే! నవ్వుతున్న ఆ కంటి వెలుగులే దివ్వెల పోలిక ఆరునులే! వన్నెలొలుకు ఆ చిగురు పెదవులే వాడివత్తలై పోవునులే పాలుపొంగు ఆ కలశాలే తోలుతిత్తులై పోవునులే నడుము వంగగా నీ ఒడలు క్రుంగగా నడుము వంగగా నీ ఒడలు క్రుంగగా నడువలేని నీ బడుగు జీవితం వడవడ వణకునులే! ఆశలు రేపే సుందర దేహము అస్తి పంజరమ్మౌనులే! ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment