Wednesday, July 15, 2020

Bhaktha Thukaram » Bale bale andaalu      భక్త తుకారం » బలే బలే అందాలు

July 15, 2020 Posted by Publisher , No comments

Song » Bale bale andaalu / బలే బలే అందాలు
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Anjali devi / అంజలి దేవి ,Music Director : P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,Lyrics Writer : Veeturi / వీటూరి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
saakee :

 aa... naMdana vanamuga ee lOkamunae sRshTiMchina

 O... vanamaalee! marachitivO maanavajaatini dayamaali

 pallavi :

 balae balae aMdaalu sRshTiMchaavu

 ilaa muripiMchaavu adae aanaMdaM

 adae anubaMdhaM prabhO maakaela eeyavu

 balae balae aMdaalu sRshTiMchaavu
 charaNaM : 1

 maaTalu raani mRgaalu saitaM

 maMchiga kalasi jeeviMchaenu

 maaTalu naerchina maanarajaati

 maaraNahOmaM saagiMchaenu

 manishae perigi manasae tarigi

 manishae perigi manasae tarigi

 mamatae marachaaDu maanavuDu

 neevaela maarchavu...

 balae balae aMdaalu sRshTiMchaavu

 ilaa muripiMchaavu adae aanaMdaM

 adae anubaMdhaM prabhO maakaela eeyavu

 balae balae aMdaalu sRshTiMchaavu
 charaNaM : 2

 aa... aa... aa... aa.....

 challaga saagae selayaeTivOlae

 manasae nirmalamai vikasiMchaali

 guMpuga egirae guvvalavOlae

 aMdaru okkaTai nivasiMchaali

 svaarthaM maanukoni samatae peMchukoni

 svaarthaM maanukoni samatae peMchukoni

 maMchiga maanavuDae maadhavuDai

 mahilOna nilavaali...

 balae balae aMdaalu sRshTiMchaavu

 ilaa muripiMchaavu adae aanaMdaM

 adae anubaMdhaM prabhO maakaela eeyavu

 balae balae aMdaalu sRshTiMchaavu



Click here to hear the song
సాకీ :

 ఆ... నందన వనముగ ఈ లోకమునే సృష్టించిన

 ఓ... వనమాలీ! మరచితివో మానవజాతిని దయమాలి

 పల్లవి :

 బలే బలే అందాలు సృష్టించావు

 ఇలా మురిపించావు అదే ఆనందం

 అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు

 బలే బలే అందాలు సృష్టించావు
 చరణం : 1

 మాటలు రాని మృగాలు సైతం

 మంచిగ కలసి జీవించేను

 మాటలు నేర్చిన మానరజాతి

 మారణహోమం సాగించేను

 మనిషే పెరిగి మనసే తరిగి

 మనిషే పెరిగి మనసే తరిగి

 మమతే మరచాడు మానవుడు

 నీవేల మార్చవు...

 బలే బలే అందాలు సృష్టించావు

 ఇలా మురిపించావు అదే ఆనందం

 అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు

 బలే బలే అందాలు సృష్టించావు
 చరణం : 2

 ఆ... ఆ... ఆ... ఆ.....

 చల్లగ సాగే సెలయేటివోలే

 మనసే నిర్మలమై వికసించాలి

 గుంపుగ ఎగిరే గువ్వలవోలే

 అందరు ఒక్కటై నివసించాలి

 స్వార్థం మానుకొని సమతే పెంచుకొని

 స్వార్థం మానుకొని సమతే పెంచుకొని

 మంచిగ మానవుడే మాధవుడై

 మహిలోన నిలవాలి...

 బలే బలే అందాలు సృష్టించావు

 ఇలా మురిపించావు అదే ఆనందం

 అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు

 బలే బలే అందాలు సృష్టించావు
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment