Song » Om Namassivaya / ఓం నమశ్శివాయ
Song Details:Actor :
Krishnam Raju / కృష్ణం రాజు ,Actress :
Vanisree / వాణిశ్రీ ,Music Director :
P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,
Satyam / సత్యం ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
V.Ramakrishna / వి.రామకృష్ణ ,Song Category : Devotional Songs
OM namaSSivaaya namO bhavaaya OMkaara swarUpaaya virUpaaya namO viShNu rUpaaya avyayaaya anaMtaaya abhavaaya namOnamaH takiTataka takiTataka cakita padayugaLaa nikaTa gaMdasnavita makuTa taTa nigaLaa saaMdracCaTaapaTala niTala caMdrakaLaa jayajaya mahadEvaa shivashaMkara harahara mahadEva abhayaMkaraa ani dEvatalu shivuni koniyaaDa, paravasha mmuna shivuDu taaMDavammaaDagaa kaMpiMcenaMtalO akaala praLayajwaala jagamulElinavaani sagamu nivverabOye sagamu migilina vaani mogamu nagavai pOyE OM namaSSivaaya OM namaSSivaaya ataDE ataDE arjunuDu paaMDava vIra yashOdhanuDu anitara saadhyamu paashupataastramu kOri iMdragiri jEri shivunikai ahOraatramulu cEsenu tapassu idi sRuShTiMcenu divya mahassu nelavaMka talapaaga nemali Ikaga maare talapaina gaMgamma talapulOniki jaare nippulu misE kannu nidurOyi boTTaaye bUdi pUtaku maaru pulitOlu valuvaaye eruka galgina shivuDu erukagaa maaragaa talli paarvati maare taane erukatagaa OMkaara dhanuvugaa odige trishUlammu kailaasamunu vIDi kadali vaccenu shivuDu shivuni aanatini shiramuna daalci mUkaasuruDanu raakShasuDu varaaha rUpamu dhariMci vaccenu dharaatalammE adiripOvagaa ciccara piDugai vaccina paMdini reccina kOpamutO arjunuDu maTTupeTTagaa paTTe baaNamu dhanuvoka cEtanu aMdukoni maasina kaMTanu cUDakanE - guri cUsinaMtanE - vEsinaMtanE talalu reMDugaa vilavilalaaDucU tanuvu koMDagaa giragira tirugucU aTu niTu tagilina reMDu baaNamula asuvulu vIDenu varaahamu koTTiti nEnani arjunuDu - paDagoTTitinEnani shivuDu- paTTina paTTu vadalakanE toDakaTTina bIramutO apuDu- vETanaadi vETunaadi vETaaDE cOTunaadi ETi tagavu pommani vilumITi palike shivuDu cEvanaadi cEtanaadi cETerugani ITe naadi cEvuMTE rammani kanusaiga cEse arjunuDu- gaaMDIva paaMDitya kaLalugaa baaNaalu kuripiMce arjunuDu - kaanI apuDataDu vEyi cEtula kaartavIryaarjunuDu OMkaara Gana dhanuShTaMkaaramula tODa sharaparaMpara kurise haruDu -ayinaa naruni kaataDu manOharuDu- citramEmO peTTina guri vaTTidaayE.. astramulE viPalamaayE - shasrtamulE vikalamaayE savyasaaci kuDi eDamai saMdhiMcuTa maracipOye- jagatiki sugatini saadhiMcina tala gaMgaku nelavai kaLakaadaruvai haribrahmalaku taragani paruvai atipavitramai-aGalavitramai SrIkaramai -shubhamaina shivuni tala adaragaa - sRuShTi cedaragaa taaDi ettu gaaMDIvamutO -mu ttaaDi ettugaa edigi arjunuDu caMDakOpamuna koTTinaMtanE talli taMDrula caluva tanuvaina dEvuDu kOrina varaaliccu koMDaMta dEvuDu eduTa nilicenu shivuDu edalOni dEvuDu padamu laMTenu naruDu bhaktitO apuDu karacaraNa kRutaMvaa-karma vaakkaayajaMvaa shravaNa nayanajaMvaa - maanasaM vaaparaadhaM vihita mavihitaMvaa-sarvamE tat kShamaswaa shivashiva karuNaabdE- shrI mahaadEva shaMBO namastE - namastE namastE namaH. Click here to hear the song
ఓం నమశ్శివాయ నమో భవాయ ఓంకార స్వరూపాయ విరూపాయ నమో విష్ణు రూపాయ అవ్యయాయ అనంతాయ అభవాయ నమోనమః తకిటతక తకిటతక చకిత పదయుగళా నికట గందస్నవిత మకుట తట నిగళా సాంద్రచ్ఛటాపటల నిటల చంద్రకళా జయజయ మహదేవా శివశంకర హరహర మహదేవ అభయంకరా అని దేవతలు శివుని కొనియాడ, పరవశ మ్మున శివుడు తాండవమ్మాడగా కంపించెనంతలో అకాల ప్రళయజ్వాల జగములేలినవాని సగము నివ్వెరబోయె సగము మిగిలిన వాని మొగము నగవై పోయే ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ అతడే అతడే అర్జునుడు పాండవ వీర యశోధనుడు అనితర సాధ్యము పాశుపతాస్త్రము కోరి ఇంద్రగిరి జేరి శివునికై అహోరాత్రములు చేసెను తపస్సు ఇది సృష్టించెను దివ్య మహస్సు నెలవంక తలపాగ నెమలి ఈకగ మారె తలపైన గంగమ్మ తలపులోనికి జారె నిప్పులు మిసే కన్ను నిదురోయి బొట్టాయె బూది పూతకు మారు పులితోలు వలువాయె ఎరుక గల్గిన శివుడు ఎరుకగా మారగా తల్లి పార్వతి మారె తానె ఎరుకతగా ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు శివుని ఆనతిని శిరమున దాల్చి మూకాసురుడను రాక్షసుడు వరాహ రూపము ధరించి వచ్చెను ధరాతలమ్మే అదిరిపోవగా చిచ్చర పిడుగై వచ్చిన పందిని రెచ్చిన కోపముతో అర్జునుడు మట్టుపెట్టగా పట్టె బాణము ధనువొక చేతను అందుకొని మాసిన కంటను చూడకనే - గురి చూసినంతనే - వేసినంతనే తలలు రెండుగా విలవిలలాడుచూ తనువు కొండగా గిరగిర తిరుగుచూ అటు నిటు తగిలిన రెండు బాణముల అసువులు వీడెను వరాహము కొట్టితి నేనని అర్జునుడు - పడగొట్టితినేనని శివుడు- పట్టిన పట్టు వదలకనే తొడకట్టిన బీరముతో అపుడు- వేటనాది వేటునాది వేటాడే చోటునాది ఏటి తగవు పొమ్మని విలుమీటి పలికె శివుడు చేవనాది చేతనాది చేటెరుగని ఈటె నాది చేవుంటే రమ్మని కనుసైగ చేసె అర్జునుడు- గాండీవ పాండిత్య కళలుగా బాణాలు కురిపించె అర్జునుడు - కానీ అపుడతడు వేయి చేతుల కార్తవీర్యార్జునుడు ఓంకార ఘన ధనుష్టంకారముల తోడ శరపరంపర కురిసె హరుడు -అయినా నరుని కాతడు మనోహరుడు- చిత్రమేమో పెట్టిన గురి వట్టిదాయే.. అస్త్రములే విఫలమాయే - శస్ర్తములే వికలమాయే సవ్యసాచి కుడి ఎడమై సంధించుట మరచిపోయె- జగతికి సుగతి ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment