Song » Sirisiri laali / సిరిసిరి లాలి
Song Details:Actor :
S.V.Ranga Rao / ఎస్.వి.రంగారావు ,Actress :
Roja Ramani / రోజారమణి ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Balamurali Krishna / బాలమురళి కృష్ణ ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Others
lIlAvati:sirisiri lAli cinnArilAlI nOmula paMTaku nUrELLalAlI UgumA! UyalA ||siri|| pAlakaDalilO jAbilirIti varalumu ratanAla gArAla bAla muddula mUTa muripAla tOTa musimusi navvula mutyAlakOTa UgumA! UyalA ||siri|| nArada: padunAlgu lOkAla tariyiMpajEya praBaviMci nAvayya varaBaktiSIla kalalennO nI koraku kAcukoni vUcE PaliyiMpajEyumA arudaina bAla UgumA! UyalA ||siri|| lIlA: kuladIpamai velugu komaruni jUci dIviMcu nI taMDri eccOTanunnA nIvAri ASalu nettAvulIni niratamu nI kIrti vikasiMcunannA UgumA! Uyala Click here to hear the song
లీలావతి: సిరిసిరి లాలి చిన్నారిలాలీ నోముల పంటకు నూరేళ్ళలాలీ ఊగుమా! ఊయలా ||సిరి|| పాలకడలిలో జాబిలిరీతి వరలుము రతనాల గారాల బాల ముద్దుల మూట మురిపాల తోట ముసిముసి నవ్వుల ముత్యాలకోట ఊగుమా! ఊయలా ||సిరి|| నారద: పదునాల్గు లోకాల తరియింపజేయ ప్రభవించి నావయ్య వరభక్తిశీల కలలెన్నో నీ కొరకు కాచుకొని వూచే ఫలియింపజేయుమా అరుదైన బాల ఊగుమా! ఊయలా ||సిరి|| లీలా: కులదీపమై వెలుగు కొమరుని జూచి దీవించు నీ తండ్రి ఎచ్చోటనున్నా నీవారి ఆశలు నెత్తావులీని నిరతము నీ కీర్తి వికసించునన్నా ఊగుమా! ఊయల ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment