Wednesday, July 15, 2020

Bhakta Prahlada » Adukovaiah!      భక్త ప్రహ్లాద » ఆదుకోవయ్యా!

July 15, 2020 Posted by Publisher , No comments

Song » Adukovaiah! / ఆదుకోవయ్యా!

Song Details:Actor : S.V.Ranga Rao / ఎస్.వి.రంగారావు ,Actress : Roja Ramani / రోజారమణి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Poems etc
AdukOvayyA!O!  ramESA! AdukOvayyA
patitapAvana  SritajanAvana  sujana  jIvana  mAdhavA!
BuvananAyaka  muktidAyaka BaktapAlaka kESavA         ||A||
bRuMdaM:    
sarvalOka kAraNA! sakalaSOka  vAraNA!
janmajanma kAraNA! janmabaMdha mOcanA!
duShTagarva  SikShaNA! SiShTa  SAMti rakShaNA! SAMti  rakShaNA!
....................




jIvamu nIvEkadA dEvA jIvamu nIvEkadA dEvA 
brOcE BAramu nIdE kadA nA BAramu nIdE kadA!!
janakuDu nIpai kinuka vahiMcI nanu vadhiyiMpa madineMcE
caMpEdevarU samasEdevarU sarvamu nIvE kadA svAmI !!

.......................




ninnEgAnI parulaneruMgA!
rAvE! varadA! brOvagarAvE! varadA! varadA!
ani moraliDagA kariviBu gAcina
svAmini nIvuMDa BayamElanayyA||
jIvamu nIvE kadA||
......................




hE! praBO! hE! praBO!
lakShmI vallaBa! dIna SaraNyA! karuNA BaraNA! kamala lOcana !
kannula viMduvu cEyagarAvE ! aSrita Bava BaMdha nirmUlanA!
lakShmI vallaBA! lakShmI vallaBA
....................




ninnE nammI nI pada yugaLI, sannutijEsE BaktAvaLikI
minnAgula gana BayamadiyElA, pannagaSayanA nArAyaNA
||jIvamu nIvE kadA||

.....................




madilO velilO cIkaTimApI,
pathamu jUpE patitapAvanA!
||jIvamu nIvE kadA||
....................




BavajaladhinibaDi  tElagalEni, jIvulabrOcE paramapuruShA! nanu
kApADi nI  birudamunU, niluvukoMTivA  SritamaMdAra
||jIvamu nIvEkadA||
...............




viSvamuniMDI veligE nIvE,  nAlOnuMDI nannukAvagA!
viShamunudrAvA veruvaganElA viShadhara  SayanA!
viSvapAlanA!                     ||jIvamu nIvEkadA||



...................
ఆదుకోవయ్యా! ఓ!  రమేశా! ఆదుకోవయ్యా
పతితపావన  శ్రితజనావన  సుజన  జీవన  మాధవా!
భువననాయక  ముక్తిదాయక భక్తపాలక కేశవా         ||ఆ||
బృందం:    
సర్వలోక కారణా! సకలశోక  వారణా!
జన్మజన్మ కారణా! జన్మబంధ మోచనా!
దుష్టగర్వ  శిక్షణా! శిష్ట  శాంతి రక్షణా! శాంతి  రక్షణా!
....................




జీవము నీవేకదా దేవా జీవము నీవేకదా దేవా 
బ్రోచే భారము నీదే కదా నా భారము నీదే కదా!!
జనకుడు నీపై కినుక వహించీ నను వధియింప మదినెంచే
చంపేదెవరూ సమసేదెవరూ సర్వము నీవే కదా స్వామీ !!

......................




నిన్నేగానీ పరులనెరుంగా!
రావే! వరదా! బ్రోవగరావే! వరదా! వరదా!
అని మొరలిడగా కరివిభు గాచిన
స్వామిని నీవుండ భయమేలనయ్యా||
జీవము నీవే కదా||
....................




హే! ప్రభో! హే! ప్రభో!
లక్ష్మీ వల్లభ! దీన శరణ్యా! కరుణా భరణా! కమల లోచన !
కన్నుల విందువు చేయగరావే ! అశ్రిత భవ భంధ నిర్మూలనా!
లక్ష్మీ వల్లభా! లక్ష్మీ వల్లభా
....................




నిన్నే నమ్మీ నీ పద యుగళీ, సన్నుతిజేసే భక్తావళికీ
మిన్నాగుల గన భయమదియేలా, పన్నగశయనా నారాయణా
||జీవము నీవే కదా||
..................




మదిలో వెలిలో చీకటిమాపీ,
పథము జూపే పతితపావనా!
||జీవము నీవే కదా||
................




భవజలధినిబడి  తేలగలేని, జీవులబ్రోచే పరమపురుషా! నను
కాపాడి నీ  బిరుదమునూ, నిలువుకొంటివా  శ్రితమందార
||జీవము నీవేకదా||
.................




విశ్వమునిండీ వెలిగే నీవే,  నాలోనుండీ నన్నుకావగా!
విషమునుద్రావా వెరువగనేలా విషధర  శయనా!
విశ్వపాలనా!                     ||జీవము నీవేకదా||
................

0 comments:

Post a Comment