Song » Chadamama Vachinaa / చందమామ వచ్చినా
Song Details:Actor :
Balakrishna / బాలకృష్ణ ,Actress :
Roja / రోజా ,Music Director :
Madhavapeddi Suresh / మాధవపెద్ది సురేష్ ,Lyrics Writer :
Sirivennela / సిరి వెన్నెల ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,
Sandhya / సంధ్య ,Song Category : Others
pallavi : chaMdamaama vachchinaa challagaali veechinaa chichchu aaradaelanammaa O cheliyaa saMgataemO cheppavammaa chaMdanaalu poosinaa eMta saeva chaesinaa chiMta teeradaelanammaa O sakhiyaa unnamaaTa oppukOmmaa jaMTa laedanaa... aahaahaa iMta vaedanaa... OhOhO jaMTa laedanaa iMta vaedanaa eMta chinnabOtivammaa chaMdamaama O muripaala mallika darijaerukuMTinae paruvaala vallika idi marulugonna mahimO ninu maruvalaeni maikamO eMta eMta viMta mOhamO ratikaaMtuni SRMgaara maMtramO (2) maru mallela saramO viri villula SaramO (2) praNayaanubaMdhameMta chitramO IIeMtaII charaNaM : 1 virisina vanamO yavvanamO pilichiMdi chilipi vaeDuka kilakila paaTagaa chaluvala varamO kalavaramO tarimiMdi teepi kOrika cheluvanu chooDagaa dariSanameeyavae sarasaku chaeragaa teralanu teeyavae taLukula taaraka madanuDi laekha SaSiraekha abhisaarika IIeMtaII charaNaM : 2 kalalanu raepae kaLa uMdi alivaeNi kaMTi saigalO jigibigi sOkulO eDadanu oopae oDupuMdi sumabaala teega maenilO sogasula taavilO kadalani aaTagaa nilichina vaeDuka baduliDa raavugaa pilichina kOrika biDiyamadaela priyuraala maNimaekhala IIeMtaII Click here to hear the song
పల్లవి : చందమామ వచ్చినా చల్లగాలి వీచినా చిచ్చు ఆరదేలనమ్మా ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా చందనాలు పూసినా ఎంత సేవ చేసినా చింత తీరదేలనమ్మా ఓ సఖియా ఉన్నమాట ఒప్పుకోమ్మా జంట లేదనా... ఆహాహా ఇంత వేదనా... ఓహోహో జంట లేదనా ఇంత వేదనా ఎంత చిన్నబోతివమ్మా ॥చందమామ॥ ఓ మురిపాల మల్లిక దరిజేరుకుంటినే పరువాల వల్లిక ఇది మరులుగొన్న మహిమో నిను మరువలేని మైకమో ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో (2) మరు మల్లెల సరమో విరి విల్లుల శరమో (2) ప్రణయానుబంధమెంత చిత్రమో ॥ఎంత॥ చరణం : 1 విరిసిన వనమో యవ్వనమో పిలిచింది చిలిపి వేడుక కిలకిల పాటగా చలువల వరమో కలవరమో తరిమింది తీపి కోరిక చెలువను చూడగా దరిశనమీయవే సరసకు చేరగా తెరలను తీయవే తళుకుల తారక మదనుడి లేఖ శశిరేఖ అభిసారిక ॥ఎంత॥ చరణం : 2 కలలను రేపే కళ ఉంది అలివేణి కంటి సైగలో జిగిబిగి సోకులో ఎడదను ఊపే ఒడుపుంది సుమబాల తీగ మేనిలో సొగసుల తావిలో కదలని ఆటగా నిలిచిన వేడుక బదులిడ రావుగా పిలిచిన కోరిక బిడియమదేల ప్రియురాల మణిమేఖల ॥ఎంత॥ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment