Song » Mukkoti Devatalu / ముక్కోటి దేవతలు
Song Details:Actor :
Ramana murty JV / రమణమూర్తి జె.వి. ,Actress :
Krishna kumari / కృష్ణ కుమారి ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Others
pallavi : mukkOTi dae vatalu okkaTainaaru chakkanni paapanu ikkaDuMchaaru mukkOTi dae vatalu okkaTainaaru chakkanni paapanu ikkaDuMchaaru ekkaDunnaagaani dikkuvaaraekadaa chikkulanu viDadeesi darijaerchalaeraa mukkOTi dae vatalu okkaTainaaru chakkanni paapanu ikkaDuMchaaru charaNaM : 1 aali eDabaaTepuDu anubhaviMcheDuvaaDu alamaelumaMgapati avanilO okaDae aeDukoMDalavaaDu ellavaeLalayaMdu dOgaaDu baaluniki tODuneeDautaaDu mukkOTi dae vatalu okkaTainaaru chakkanni paapanu ikkaDuMchaaru charaNaM : 2 nellooriseemalO challaMga SayaniMchu SreeraMganaayakaa aanaMdadaayakaa taMDri manasuku SaaMti tanayuniki SaraNu dayachaeyumaa neevu kshaNamu eDabaayakaa... mukkOTi dae vatalu okkaTainaaru chakkanni paapanu ikkaDuMchaaru charaNaM : 3 ellalOkaalaku tallivayi neevuMDa pillavaaniki iMka tallipraema korata baruvaaye bratuku che~ruvaaye kanneeru baruvaaye bratuku che~ruvaaye kanneeru karuNiMchi kaapaaDu maa kanakadurgaa... mukkOTi dae vatalu okkaTainaaru chakkanni paapanu ikkaDuMchaaru charaNaM : 4 gOpannavale vagachu aapannulanu gaachi baadhalanu teerchaeTi bhadraadrivaasaa... baadhalanu teerchaeTi bhadraadrivaasaa... ninnu nammina kOrke neravaerunayyaa chinnaari baalunaku Sreeraamara ksha... mukkOTi dae vatalu okkaTainaaru chakkanni paapanu ikkaDuMchaaru charaNaM : 5 baalaprahlaaduni laaliMchi brOchina naarasiMhuni kannaa vaeru daivamu laeDu aMtu teliyagaraani aavaedanalugaligae aMtu teliyagaraani aavaedanalugaligae chiMtalanu tolagiMchu siMhaachalaeSaa... mukkOTi dae vatalu okkaTainaaru chakkanni paapanu ikkaDuMchaaru
పల్లవి : ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కన్ని పాపను ఇక్కడుంచారు ముక్కోటి దే వతలు ఒక్కటైనారు చక్కన్ని పాపను ఇక్కడుంచారు ఎక్కడున్నాగాని దిక్కువారేకదా చిక్కులను విడదీసి దరిజేర్చలేరా ముక్కోటి దే వతలు ఒక్కటైనారు చక్కన్ని పాపను ఇక్కడుంచారు చరణం : 1 ఆలి ఎడబాటెపుడు అనుభవించెడువాడు అలమేలుమంగపతి అవనిలో ఒకడే ఏడుకొండలవాడు ఎల్లవేళలయందు దోగాడు బాలునికి తోడునీడౌతాడు ముక్కోటి దే వతలు ఒక్కటైనారు చక్కన్ని పాపను ఇక్కడుంచారు చరణం : 2 నెల్లూరిసీమలో చల్లంగ శయనించు శ్రీరంగనాయకా ఆనందదాయకా తండ్రి మనసుకు శాంతి తనయునికి శరణు దయచేయుమా నీవు క్షణము ఎడబాయకా... ముక్కోటి దే వతలు ఒక్కటైనారు చక్కన్ని పాపను ఇక్కడుంచారు చరణం : 3 ఎల్లలోకాలకు తల్లివయి నీవుండ పిల్లవానికి ఇంక తల్లిప్రేమ కొరత బరువాయె బ్రతుకు చెఱువాయె కన్నీరు బరువాయె బ్రతుకు చెఱువాయె కన్నీరు కరుణించి కాపాడు మా కనకదుర్గా... ముక్కోటి దే వతలు ఒక్కటైనారు చక్కన్ని పాపను ఇక్కడుంచారు చరణం : 4 గోపన్నవలె వగచు ఆపన్నులను గాచి బాధలను తీర్చేటి భద్రాద్రివాసా... బాధలను తీర్చేటి భద్రాద్రివాసా... నిన్ను నమ్మిన కోర్కె నెరవేరునయ్యా చిన్నారి బాలునకు శ్రీరామర క్ష... ముక్కోటి దే వతలు ఒక్కటైనారు చక్కన్ని పాపను ఇక్కడుంచారు చరణం : 5 బాలప్రహ్లాదుని లాలించి బ్రోచిన నారసింహుని కన్నా వేరు దైవము లేడు అంతు తెలియగరాని ఆవేదనలుగలిగే అంతు తెలియగరాని ఆవేదనలుగలిగే చింతలను తొలగించు సింహాచలేశా... ముక్కోటి దే వతలు ఒక్కటైనారు చక్కన్ని పాపను ఇక్కడుంచారు
0 comments:
Post a Comment