Tuesday, July 14, 2020

Batasari » Kanulaku dochi      బాటసారి » కనులకు దోచి

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Kanulaku dochi / కనులకు దోచి
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Bhanumathi / భానుమతి  ,Music Director : Master Venu / మాస్టర్ \tవేణు ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Bhanumathi Ramakrishna / భానుమతి రామకృష్ణ  ,  Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
kanulaku dOci cEtikaMdani eMDamAvulunnay

sOyagamuMDi suKamu nOcani bratukulunnavi konni

kanulaku dOci cEtikaMdani eMDamAvulunnay

sOyagamuMDi suKamu nOcani bratukulunnavi konni



BUmijaniMci Akali kodagani Palamulunnavi konni

BUmijaniMci Akali kodagani Palamulunnavi konni

manasuna niMDi palukagarAni talapulunnavi konni

talapulunnavi konni



sRuShTi cEsinadi dEvuDaina mari nASamu nEla sRujiMcE

paluku nosaginadi dEvuDaina mari mUgalanEla sRujiMcE

kanula nosaginadi dEvuDaina mari aMdhulanEla sRujiMcE

kanula nosaginadi dEvuDaina mari aMdhulanEla sRujiMcE

veluguniccinadi dEvuDaina mari cIkaTinEla sRujiMcE

penu cIkaTinEla sRujiMcE



vEda SAstramulu cadivinavArE erugaru sRuShTi vilAsaM

vEda SAstramulu cadivinavArE erugaru sRuShTi vilAsaM

alpabudditO j~jAnadAtanE salupaku parihAsaM … salupaku parihAsaM

bratukaMtA palu praSnalamayamai bratukunu janakamulAyaM

badalu kOsamai vedakuTamAni bratukuTayE nyAyaM

bratukaMtA palu praSnalamayamai bratukunu janakamulAyaM

badalu kOsamai vedakuTamAni bratukuTayE nyAyaM
కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్

సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని

కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్

సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని



భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని

భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని

మనసున నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని

తలపులున్నవి కొన్ని



సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే

పలుకు నొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే

కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే

కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే

వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటినేల సృజించే

పెను చీకటినేల సృజించే



వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం

వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం

అల్పబుద్దితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం … సలుపకు పరిహాసం

బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనకములాయం

బదలు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం

బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనకములాయం

బదలు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం

0 comments:

Post a Comment