Song » Maaraali Maaraali / మారాలి మారాలి
Song Details:Actor :
Shobhan Babu / శోభన్ బాబు ,Actress :
Shaarada / శారద ,Music Director :
K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: mArAli mArAli manuShula naDavaDi mArAli taratarAlugA mAranivALLanu mI taramainA mArcAli mArAli mArAli manuShula gAraDi mArAli meppula kOsaM ceppEvALLanu mI taramainA mArcAli mArAli mArAli manuShula gAraDi mArAli caraNaM: aMdaru dEvuni saMtati kAdA eMduku taratama BEdAlu aMdari dEvuDu okaDE ayitE aMdari dEvuDu okaDE ayitE eMduku kOTi rUpAlu aMdari raktaM okaTE kAdA eMduku kulamata BEdAlu aMdari raktaM okaTE ayitE eMduku raMgula tEDAlumArAli mArAli manuShula naDavaDi mArAli caraNaM: telisi telisi burada nITilO evarainA digutArA A buradalOnE aMdAla kamalaM puDutuMdani maricErA kamalaM kOsaM buradalOnE kApuramuMDEdevaru manuShullA batikEvAru samadharmaM cATEvAru 2 vAridE InATitaraM vAridE rAnunna yugaM kAdanEvAru iMkA kaLLu teravani vAru 2 mElukOka tappadulE mAripOka tappadulE, tappadulE mArAli mArAli manuShula naDavaDi mArAli taratarAlugA mAranivALLanu mI taramainA mArcAli Click here to hear the song
పల్లవి: మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి తరతరాలుగా మారనివాళ్ళను మీ తరమైనా మార్చాలి మారాలి మారాలి మనుషుల గారడి మారాలి మెప్పుల కోసం చెప్పేవాళ్ళను మీ తరమైనా మార్చాలి మారాలి మారాలి మనుషుల గారడి మారాలి చరణం: అందరు దేవుని సంతతి కాదా ఎందుకు తరతమ భేదాలు అందరి దేవుడు ఒకడే అయితే అందరి దేవుడు ఒకడే అయితే ఎందుకు కోటి రూపాలు అందరి రక్తం ఒకటే కాదా ఎందుకు కులమత భేదాలు అందరి రక్తం ఒకటే అయితే ఎందుకు రంగుల తేడాలుమారాలి మారాలి మనుషుల నడవడి మారాలి చరణం: తెలిసి తెలిసి బురద నీటిలో ఎవరైనా దిగుతారా ఆ బురదలోనే అందాల కమలం పుడుతుందని మరిచేరా కమలం కోసం బురదలోనే కాపురముండేదెవరు మనుషుల్లా బతికేవారు సమధర్మం చాటేవారు 2 వారిదే ఈనాటితరం వారిదే రానున్న యుగం కాదనేవారు ఇంకా కళ్ళు తెరవని వారు 2 మేలుకోక తప్పదులే మారిపోక తప్పదులే, తప్పదులే మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి తరతరాలుగా మారనివాళ్ళను మీ తరమైనా మార్చాలి ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment