
Song » Maanavude / మానవుడే
Song Details:Actor :
S.V.Ranga Rao / ఎస్.వి.రంగారావు ,Actress :
Anjali devi / అంజలి దేవి ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Others
Pallavi : maanavuDae mahaneeyuDu maanavuDae mahaneeyuDu SaktiyutuDu yuktiparuDu maanavuDae... maananeeyuDu maanavuDae mahaneeyuDu anupallavi : maMchini talapeTTinachO manishikaDDulaedulae praeraNa daivaanidaina saadhiMchunu naruDae maanavuDae mahaneeyuDu maanavuDae mahaneeyuDu charaNaM : 1 divija gaMga bhuvi diMpina bhageerathuDu maanavuDae susthira taaraga maarina dhruvuDu kooDa maanavuDae sRshTiki pratisRshTi chaeyu viSvaamitruDu naruDae jeevakOTi sarvamulO SraeshTatamuDu maanavuDae maanavuDae mahaneeyuDu maanavuDae mahaneeyuDu charaNaM : 2 graharaaSulanadhigamiMchi ghanataarala pathamu nuMchi graharaaSulanadhigamiMchi ghanataarala pathamu nuMchi gaganaaMtara rOdasilO... gaMdharva gOLa tatula daaTi chaMdralOkamainaa daevaeMdra lOkamainaa chaMdralOkamainaa daevaeMdra lOkamainaa boMditO jayiMchi marala bhuviki tirigi raagaligae maanavuDae mahaneeyuDu maanavuDae mahaneeyuDu SaktiyutuDu yuktiparuDu maanavuDae... maananeeyuDu maanavuDae mahaneeyuDu Click here to hear the song
పల్లవి : మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే... మాననీయుడు మానవుడే మహనీయుడు అనుపల్లవి : మంచిని తలపెట్టినచో మనిషికడ్డులేదులే ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు చరణం : 1 దివిజ గంగ భువి దింపిన భగీరథుడు మానవుడే సుస్థిర తారగ మారిన ధ్రువుడు కూడ మానవుడే సృష్టికి ప్రతిసృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు చరణం : 2 గ్రహరాశులనధిగమించి ఘనతారల పథము నుంచి గ్రహరాశులనధిగమించి ఘనతారల పథము నుంచి గగనాంతర రోదసిలో... గంధర్వ గోళ తతుల దాటి చంద్రలోకమైనా దేవేంద్ర లోకమైనా చంద్రలోకమైనా దేవేంద్ర లోకమైనా బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే... మాననీయుడు మానవుడే మహనీయుడు ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment