Sunday, July 26, 2020

Avunu valliddaroo ishtapaddaaru » Raa Rammani Rara      ఔను .. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు » రా రమ్మని రారా

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Raa Rammani Rara / రా రమ్మని రారా

Song Details:Actor : Ravi teja / రవి తేజ  ,Actress : Kalyani / కళ్యాణి ,Music Director : Chakri / చక్రి  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Kausalya / కౌసల్య ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi :

raa rammani raaraa rammani... raa rammani raaraa rammani...

raamachiluka pilichenu ee vaeLa

allari velluvagaa challani pallavigaa mallela pallakigaa raanaa

ukkiri bikkirigaa mikkili makkuvagaa chukkala pakkaku goni pOnaa

lae lemmani laelae lemmani laetagaali taakenu ee vaeLa

maaTalakaMdani oosulatO manasae niMDina dOsilitO

praemiMchukOnaa pratijanmalO kotta janmaMdukOnaa nee praemalO

vihariMchanaa nee hRdayaalayaMlO

raa rammani raaraa rammani... raa rammani raaraa rammani...

raamachiluka pilichenu ee vaeLa
charaNaM : 1

pedaallO prathama padamu nuvvae edallO taragani gani nuvvae

jagaMlO asalu varamu nuvvae janaallO sisalu doravu nuvvae

aNuvaNuvuna naalO nuvvae amRtamae chilikaavae

aDugaDuguna naatO nuvvae adbhutamae choopaavae

nijaMlO nuvvu nidarlO nuvvu sadaa naaveMTa uMDagaa

idaegaa praemapaMDuga...

raa rammani raaraa rammani... raa rammani raaraa rammani...

raamachiluka pilichenu ee vaeLa
charaNaM : 2

phaliMchae paDuchu phalamu neekae bigiMchae kaugili gili neekae

sumiMchae sarasa kavita neekae SramiMchae chilipi chorava neekae

edigochchina paruvaM neekae aedainaa neekorakae

nuvu mechchina pratidee neekae naa yaatana neekerukae

samastaM neeku sakaalaMlOna svayaanaa naenu paMchanaa

sukhistaanu nee paMchana...

raa rammani raaraa rammani... raa rammani raaraa rammani...

raamachiluka pilichenu ee vaeLa

allari velluvagaa challani pallavigaa mallela pallakigaa raanaa

ukkiri bikkirigaa mikkili makkuvagaa chukkala pakkaku goni pOnaa

lae lemmani laelae lemmani laetagaali taakenu ee vaeLa

maaTalakaMdani oosulatO manasae niMDina dOsilitO

praemiMchukOnaa pratijanmalO kotta janmaMdukOnaa nee praemalO

vihariMchanaa nee hRdayaalayaMlO...
 
 


Click here to hear the song
పల్లవి :

రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని...

రామచిలుక పిలిచెను ఈ వేళ

అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా

ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొని పోనా

లే లెమ్మని లేలే లెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ

మాటలకందని ఊసులతో మనసే నిండిన దోసిలితో

ప్రేమించుకోనా ప్రతిజన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో

విహరించనా నీ హృదయాలయంలో

రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని...

రామచిలుక పిలిచెను ఈ వేళ
చరణం : 1

పెదాల్లో ప్రథమ పదము నువ్వే ఎదల్లో తరగని గని నువ్వే

జగంలో అసలు వరము నువ్వే జనాల్లో సిసలు దొరవు నువ్వే

అణువణువున నాలో నువ్వే అమృతమే చిలికావే

అడుగడుగున నాతో నువ్వే అద్భుతమే చూపావే

నిజంలో నువ్వు నిదర్లో నువ్వు సదా నావెంట ఉండగా

ఇదేగా ప్రేమపండుగ...

రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని...

రామచిలుక పిలిచెను ఈ వేళ
చరణం : 2

ఫలించే పడుచు ఫలము నీకే బిగించే కౌగిలి గిలి నీకే

సుమించే సరస కవిత నీకే శ్రమించే చిలిపి చొరవ నీకే

ఎదిగొచ్చిన పరువం నీకే ఏదైనా నీకొరకే

నువు మెచ్చిన ప్రతిదీ నీకే నా యాతన నీకెరుకే

సమస్తం నీకు సకాలంలోన స్వయానా నేను పంచనా

సుఖిస్తాను నీ పంచన...

రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని...

రామచిలుక పిలిచెను ఈ వేళ

అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా

ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొని పోనా

లే లెమ్మని లేలే లెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ

మాటలకందని ఊసులతో మనసే నిండిన దోసిలితో

ప్రేమించుకోనా ప్రతిజన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో

విహరించనా నీ హృదయాలయంలో...
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment