Saturday, July 18, 2020

Attarintiki Daredi » Veedu Aaradugula bullettu      అత్తారింటికి దారేది » వీడు ఆరడుగుల బుల్లెట్టు

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Veedu Aaradugula bullettu / వీడు ఆరడుగుల బుల్లెట్టు

Song Details:Actor : Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress : Samantha / సమంత ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sree Mani / శ్రీ మణి ,Singer : M.R.L. Karthikeyan / ఎమ్.ఆర్.ఎల్. కార్తికేయన్  ,  Vijay Prakash / విజయ్ ప్రకాశ్ ,Song Category : Inspiring & Motivational Songs
gaganapu vIdhi vIDi valasa veLlipOyina

nIli mabbu kOsaM

taraliMdi tanaku tAnE AkASaM paradESaM

SiKarapu aMcu nuMci nEla jAripOyina

nITi cukka kOsaM

viDiciMdi cUDu nagamE 

tanavAsaM vanavAsaM



BairavuDO BArgavuDO

BAskaruDO mari rakkasuDO

ukku tIga lAMTi oMTi naijaM

vIDu merupulanni okkaTaina tEjaM



rakShakuDO takShakuDO parIkShalakE sushikShituDO

SatruvaMTU lEni viMta yuddhaM

guMDelOtu gAyamaina SabdaM



naDicoccE nartana Sauri....

parigettE parAkrama Saili

hAlAhalaM BariMcina dhagdha hRudayuDO

vIDu AraDugula bulleTTu

vIDu dhairyaM visirina rAkeTTu



charaNaM:1

divi nuMci BUvi paiki

Baga Bagamani kurisETi

vinipiMcani kiraNaM cappuDu vIDu

vaDi vaDigA vaDagaLLai

daDa daDa mani jArETi

kanipiMcani jaDi vAnEgA vIDu

ShaMKhaM lO dAgETi pOTettina saMdraM hOritaDu

ShOkAnnE dATEsE aShOkuDu vIDurO

vIDu AraDugula bulleTTu

vIDu dhairyaM visirina rAkeTTu



caraNaM:2

tana modalE odulukoni

paikedigina kommalaki

civuriMcina cOTuni cUpistADu.

tana diSanE mArcukoni

praBaviMcE sUryuDiki

tana tUrupu paricayamE cEstADu

rAvaNuDo rAGavuDo 

manasulu dOcE mAdhavuDO

sainikuDO SrAmikuDO

asAdhyuDu vIDurO

vIDAraDugula bulleTTu

vIDu dhairyaM visirina rAkeTTu
గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన
నీలి మబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన
నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమే 
తనవాసం వనవాసం



భైరవుడో భార్గవుడో
భాస్కరుడో మరి రక్కసుడో
ఉక్కు తీగ లాంటి ఒంటి నైజం
వీడు మెరుపులన్ని ఒక్కటైన తేజం



రక్షకుడో తక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో
శత్రువంటూ లేని వింత యుద్ధం
గుండెలోతు గాయమైన శబ్దం



నడిచొచ్చే నర్తన శౌరి....
పరిగెత్తే పరాక్రమ శైలి
హాలాహలం భరించిన ధగ్ధ హృదయుడో
వీడారడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు



చరణం:1
దివి నుంచి భువి పైకి
భగ భగమని కురిసేటి
వినిపించని కిరణం చప్పుడు వీడు
వడి వడిగా వడగళ్ళై
దడ దడ మని జారేటి
కనిపించని జడి్వానేగా వీడు
శంఖంలో దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడు
శోకాన్నే దాటేసే అశోకుడు వీడురో
వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు



చరణం:2
తన మొదలే ఒదులుకొని
పైకెదిగిన కొమ్మలకి
చివురించిన చోటుని చూపిస్తాడు.
తన దిశనే మార్చుకొని
ప్రభవించే సూర్యుడికి
తన తూరుపు పరిచయమే చేస్తాడు
రావణుడొ రాఘవుడొ 
మనసులు దోచే మాధవుడో
సైనికుడో శ్రామికుడో
అసాధ్యుడు వీడురో
వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు

0 comments:

Post a Comment