Song » Adinchi Astachamma / ఆడించి అష్టాచమ్మా
Song Details:Actor :
Naani / నాని ,Actress :
Colours Swathi / కలర్స్ స్వాతి ,Music Director :
Kalyani Malik ( Kalyanie Koduri) / కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి ) ,Lyrics Writer :
Sirivennela / సిరి వెన్నెల ,Singer :
Sri Krishna / శ్రీ కృష్ణ ,Song Category : Others
pallavi : ADiMci aShTAcammA ODiMcAvammA nI paMTa paMDiMdE prEmA nijaMgA neggaDaM aMTE iShTaMgA ODaDaM aMtE A mATe aMTE I cinnAri nammadEMTammA nijaMgA neggaDaM aMTE iShTaMgA ODaDaM aMtE ADiMci aShTAcammA ODiMcAvammA nI paMTa paMDiMdE prEmA nijaMgA neggaDaM aMTE iShTaMgA ODaDaM aMtE A mATe aMTE I cinnAri nammadEMTammA nijaMgA neggaDaM aMTE iShTaMgA ODaDaM aMtE caraNaM : 1 O.. O.. UraMtA muMcEstU haMgAmA cEstAvEMTE gaMgammA u~M.. u~M.. GOraMgA niMdistU I paMtAleMduku cAllE maMgammA cUSAka ninnu-vESAka kannu venakkelAga tIsukonU EM ceppukOnu eTu tappukOnu nuvvoddannA nEnoppukOnu nuvvEsE gavvalATalO.. nilEsE gaLLa bATalO.. nI dAkA nannu rappiMcciMdi nuvvE lEvammA nijaMgA neggaDaM aMTE iShTaMgA ODaDaM aMtE caraNaM : 2 O.. O.. nA nEraM E~MvuMdE EM ceppiMdO nI tallO jEjemmA u~M.. u~M.. maMdAraM ayyiMdi A rOShaM tAki jaLLO jAjammA pUvvaMTI rUpaM nAjuggA gillI kevvaMdi guMDe ninna dAkA muLLaMTI kOpaM oLLaMtA allI navviMdi nEDu AgalEka mannistE tappEM lEdammA marI A mAraM mAnammA I lAvAdEvilEvI aMta kottEM kAdammA Click here to hear the song
పల్లవి : ఆడించి అష్టాచమ్మా ఓడించావమ్మా నీ పంట పండిందే ప్రేమా నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే ఆ మాటె అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే ఆడించి అష్టాచమ్మా ఓడించావమ్మా నీ పంట పండిందే ప్రేమా నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే ఆ మాటె అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే చరణం : 1 ఓ.. ఓ.. ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావేంటే గంగమ్మా ఉఁ.. ఉఁ.. ఘోరంగా నిందిస్తూ ఈ పంతాలెందుకు చాల్లే మంగమ్మా చూశాక నిన్ను-వేశాక కన్ను వెనక్కెలాగ తీసుకొనూ ఏం చెప్పుకోను ఎటు తప్పుకోను నువ్వొద్దన్నా నేనొప్పుకోను నువ్వేసే గవ్వలాటలో.. నిలేసే గళ్ళ బాటలో.. నీ దాకా నన్ను రప్పించ్చింది నువ్వే లేవమ్మా నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే చరణం : 2 ఓ.. ఓ.. నా నేరం ఏఁవుందే ఏం చెప్పిందో నీ తల్లో జేజెమ్మా ఉఁ.. ఉఁ.. మందారం అయ్యింది ఆ రోషం తాకి జళ్ళో జాజమ్మా పూవ్వంటీ రూపం నాజుగ్గా గిల్లీ కెవ్వంది గుండె నిన్న దాకా ముళ్ళంటీ కోపం ఒళ్ళంతా అల్లీ నవ్వింది నేడు ఆగలేక మన్నిస్తే తప్పేం లేదమ్మా మరీ ఆ మారం మానమ్మా ఈ లావాదేవిలేవీ అంత కొత్తేం కాదమ్మా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment