
Song » Akantamga unnaa / ఏకాతంగా ఉన్నా
Song Details:Actor :
Jr-ntr / జూనియర్ ఎన్ టీ ఆర్ ,Actress :
Samera Reddy / సమీరా రెడ్ది ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Karunya / కారుణ్య ,Song Category : Others
pallavi : aekaataMgaa unnaa eMdari madhyana unnaa neekai naenu aalOchistunnaa ae panichaestoonnaa eTu payanistoonnaa ninnae naenu aaraadhistunnaa ennennO kaLlu naa vaipae choostoo unnaa niluvellaa kaLlai neekOsaM choostoo unnaa ennennO pedavula palukulu vinipistunnaa nee pedavula pilupula kOsaM paDichastunnaa naa tanuvaMtaa manasai unnaa... aekaataMgaa unnaa eMdari madhyana unnaa charaNaM : 1 raayani laekhalu ennO naa arachaetullO iMkaa cheppani saMgatulennO naa eda goMtullO kuravani chinukulu ennO pedavula maeghaMlO iMkaa tiragani malupulu ennO jatapaDu maargaMlO manasaina aaka rshaNalO munakaestunnaa priyamaina saMgharshaNalO pulakistunnaa naa vayasaMtaa valapai unnaa... aekaataMgaa unnaa eMdari madhyana unnaa charaNaM : 2 spaMdana naenai uMTaa nee hRdayaMlOna challani laalana naenai uMTaa nee alasaTalOna archana naenai uMTaa nee oDi guDilOna vechchani rakshaNa naenai uMTaa oDiduDukullOna nee jeevana nadilO poMgae neerautunnaa saMtOshaM uppeMgae kanneerautunnaa Sata janmaala praemautunnaa aekaataMgaa unnaa eMdari madhyana unnaa Click here to hear the song
పల్లవి : ఏకాతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా నీకై నేను ఆలోచిస్తున్నా ఏ పనిచేస్తూన్నా ఎటు పయనిస్తూన్నా నిన్నే నేను ఆరాధిస్తున్నా ఎన్నెన్నో కళ్లు నా వైపే చూస్తూ ఉన్నా నిలువెల్లా కళ్లై నీకోసం చూస్తూ ఉన్నా ఎన్నెన్నో పెదవుల పలుకులు వినిపిస్తున్నా నీ పెదవుల పిలుపుల కోసం పడిచస్తున్నా నా తనువంతా మనసై ఉన్నా... ఏకాతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా చరణం : 1 రాయని లేఖలు ఎన్నో నా అరచేతుల్లో ఇంకా చెప్పని సంగతులెన్నో నా ఎద గొంతుల్లో కురవని చినుకులు ఎన్నో పెదవుల మేఘంలో ఇంకా తిరగని మలుపులు ఎన్నో జతపడు మార్గంలో మనసైన ఆక ర్షణలో మునకేస్తున్నా ప్రియమైన సంఘర్షణలో పులకిస్తున్నా నా వయసంతా వలపై ఉన్నా... ఏకాతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా చరణం : 2 స్పందన నేనై ఉంటా నీ హృదయంలోన చల్లని లాలన నేనై ఉంటా నీ అలసటలోన అర్చన నేనై ఉంటా నీ ఒడి గుడిలోన వెచ్చని రక్షణ నేనై ఉంటా ఒడిదుడుకుల్లోన నీ జీవన నదిలో పొంగే నీరౌతున్నా సంతోషం ఉప్పెంగే కన్నీరౌతున్నా శత జన్మాల ప్రేమౌతున్నా ఏకాతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment