Sunday, July 5, 2020

Arundhati » Jejammaa      అరుంధతి » జేజెమ్మా

July 05, 2020 Posted by Publisher , No comments

Song » Jejammaa / జేజెమ్మా
Song Details:Actor : None / ఎవరూలేరు  ,Actress : Anuskha / అనుష్క  ,Music Director : Koti / కోటి ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : Kailash Kher / కైలాష్ ఖేర్  ,Song Category : Others
kammukunnA cIkaTlOnA kummukoccE veluturammA

kaccakaTTI kattipaDitE ciccurEpE kALivammA

nI kannu urimi cUDagAnE dUsina katti vaNikipOvunammA

kuMce paTTi bommagIstE adE nI guMDekE addamammA

aMdarinI AdariMcE dayAmayi annapUrNa nIvammA

Alana pAlanalO nuvvE I nElaku tallivammA

nuvvu palikEdE tirugulEni vEdaM nuvvu cEsEdE edurulEni caTTaM

OrpulOna dharaNi mAtavammA tIrpulOna dharmamUrtivammA

jEjemmA mAyammA jEjemmA OyammA

jEjemmA jEjemmA mA jEjemmA
jEjemmA mAyammA jEjemmA OyammA

jEjemmA jEjemmA mA jEjemmA
nuvvu rudrarUpamettagAnE kAlamE daddarilli pOyEnammA

rudraSaktulaku nI dhATitO guMDelE baddalaipOyEnammA

busagoTTE kAmAMdhuni kasitIraka tokkavammA

puTTugaDDa Adukunna A apara BadrakALi nIvammA

vUTanilupukoMTivammA jEjemmA vuLLi janma ettinAvammA

eMta dIkSha pUninAvammA guMDelO nippulE niMpinAvammA

tyAgamaMTE nIdammA narakamE koMgulOna muDicAvammA

ninnucUsi mRutyuvukE jEjemmA kaLlu cemmagillinAyammA

I jArutunna raktadhAralE nI teguvaku hAratulu paTTEnavmU

A... A... dikkulannI SUnyamAyE veluturaMtA cIkaTAyE

ASalannI iMkipOyE SvAsa mAtraM migilipOyE
కమ్ముకున్నా చీకట్లోనా కుమ్ముకొచ్చే వెలుతురమ్మా

కచ్చకట్టీ కత్తిపడితే చిచ్చురేపే కాళివమ్మా

నీ కన్ను ఉరిమి చూడగానే దూసిన కత్తి వణికిపోవునమ్మా

కుంచె పట్టి బొమ్మగీస్తే అదే నీ గుండెకే అద్దమమ్మా

అందరినీ ఆదరించే దయామయి అన్నపూర్ణ నీవమ్మా

లన పాలనలో నువ్వే ఈ నేలకు తల్లివమ్మా

నువ్వు పలికేదే తిరుగులేని వేదం నువ్వు చేసేదే ఎదురులేని చట్టం

ఓర్పులోన ధరణి మాతవమ్మా తీర్పులోన ధర్మమూర్తివమ్మా

జేజెమ్మా మాయమ్మా జేజెమ్మా ఓయమ్మా

జేజెమ్మా జేజెమ్మా మా జేజెమ్మా
జేజెమ్మా మాయమ్మా జేజెమ్మా ఓయమ్మా

జేజెమ్మా జేజెమ్మా మా జేజెమ్మా
నువ్వు రుద్రరూపమెత్తగానే కాలమే దద్దరిల్లి పోయేనమ్మా

రుద్రశక్తులకు నీ ధాటితో గుండెలే బద్దలైపోయేనమ్మా

బుసగొట్టే కామాంధుని కసితీరక తొక్కవమ్మా

పుట్టుగడ్డ ఆదుకున్న ఆ అపర భద్రకాళి నీవమ్మా

వూటనిలుపుకొంటివమ్మా జేజెమ్మా వుళ్ళి జన్మ ఎత్తినావమ్మా

ఎంత దీక్ష పూనినావమ్మా గుండెలో నిప్పులే నింపినావమ్మా

త్యాగమంటే నీదమ్మా నరకమే కొంగులోన ముడిచావమ్మా

నిన్నుచూసి మృత్యువుకే జేజెమ్మా కళ్లు చెమ్మగిల్లినాయమ్మా

ఈ జారుతున్న రక్తధారలే నీ తెగువకు హారతులు పట్టేనవ్మూ

ఆ... ఆ... దిక్కులన్నీ శూన్యమాయే వెలుతురంతా చీకటాయే

ఆశలన్నీ ఇంకిపోయే శ్వాస మాత్రం మిగిలిపోయే

0 comments:

Post a Comment