Monday, July 20, 2020

Anthaku mundu Aa tharuvatha » Nenena Aa Nenena      అంతకు ముందు ఆ తరువాత » నేనేనా ఆ నేనేనా

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Nenena Aa Nenena / నేనేనా ఆ నేనేనా

Song Details:Actor : Sumanth Ashwin / సుమంత్ అశ్విన్ ,Actress : Eesha / ఈషా ,Music Director : Kalyani Malik ( Kalyanie Koduri) / కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి ) ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Sri Krishna / శ్రీ కృష్ణ  ,  Sunitha / సునీత ,Song Category : Love & Romantic Songs
nEnEnA A nEnEnA
nA nuMci nEnE vErayyAnA
unnAnA nEnunnanA
unnAnugA aMTunnAnA



veLlostAnaMTU.. A nijaM
O j~jApakaMlA mAripOtunnA
EM cEsAnani EM cUstunnAnani
anukOni A kShaNaM
nEnEnA A nEnEnA
nA nuMci nEnE vErayyAnA



gAlilO mEDa gAllOne uMTuMdi
nElakEnADu digirAdani
nITilO nIDa nILLallO karigiMdi
cEtikaMdEdi kAdE adi
ceppAlA evarO kottagA
adi nammalEni viMta kAdanI..
EM cEsAnani EM cUstunnAnani
anukOni A kShaNaM
nEnEnA A nEnEnA
nA nuMci nEnE vErayyAnA
A.... A..... A....



nannu nAlAga cUpiMcavEmaMTu
niluvuTaddAnni niMdiMcanA
nEnu tana lAga EnADu mArAnO
nAku nEniMka kanipiMcanA
addaMlO lOpaM lEdanI
nA cUpulOnE SUnyamuMdanI..
EM cEsAnani EM cUstunnAnani
anukOni A kShaNaM
nEnEnA A nEnEnA
nA nuMci nEnE vErayyAnA
 

 
Click here to hear the song
నేనేనా ఆ నేనేనా
నా నుంచి నేనే వేరయ్యానా
ఉన్నానా నేనున్ననా
ఉన్నానుగా అంటున్నానా



వెళ్లొస్తానంటూ.. ఆ నిజం
ఓ జ్ఞాపకంలా మారిపోతున్నా
ఏం చేసానని ఏం చూస్తున్నానని
అనుకోని ఆ క్షణం
నేనేనా ఆ నేనేనా
నా నుంచి నేనే వేరయ్యానా



గాలిలో మేడ గాల్లోనె ఉంటుంది
నేలకేనాడు దిగిరాదని
నీటిలో నీడ నీళ్ళల్లో కరిగింది
చేతికందేది కాదే అది
చెప్పాలా ఎవరో కొత్తగా
అది నమ్మలేని వింత కాదనీ..
ఏం చేసానని ఏం చూస్తున్నానని
అనుకోని ఆ క్షణం
నేనేనా ఆ నేనేనా
నా నుంచి నేనే వేరయ్యానా
ఆ.... ఆ..... ఆ....



నన్ను నాలాగ చూపించవేమంటు
నిలువుటద్దాన్ని నిందించనా
నేను తన లాగ ఏనాడు మారానో
నాకు నేనింక కనిపించనా
అద్దంలో లోపం లేదనీ
నా చూపులోనే శూన్యముందనీ..
ఏం చేసానని ఏం చూస్తున్నానని
అనుకోని ఆ క్షణం
నేనేనా ఆ నేనేనా
నా నుంచి నేనే వేరయ్యానా
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment