Song » Telugu Padaaniki / తెలుగు పదానికి
Song Details:Actor :
Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress :
Ramya krishna / రమ్యకృష్ణ ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
Sujatha / సుజాత ,Song Category : Devotional Songs
a: OM... OM.. telugu padAniki janmadinaM idi jAnapadAniki jnAnapathaM EDu svarAlE EDu koMDalai velasina kaliyuga viShNu padaM annamayya jananaM... idi annamayya jananaM idi annamayya jananaM ariShaDvargamu teganarikE hariKaDgammidi naMdakamu brahmalOkamuna brahmABArati nAdASissulu poMdinadai SivalOkamuna cidvilAsamuna DamarudhvanilO gamakitamai divyasaBalalO navya nATyamula pUbaMtula cEmaMtiga egasi nIrada maMDala nArada tuMbura mahatI gAnavu mahimalu telisi sthita himakaMdura yatirAT ssaBalO tapa: Palammuga taLukumani OM... talli tanamukai tallaDillu A lakka mAMba garBAlayammulO pravESiMce A naMdakamu naMdanAnaMda kArakamu annamayya jananaM... idi annamayya jananaM idi annamayya jananaM A: padmAvatiyE puruDu pOyagA padmAsanuDE usuru pOyagA a: viShNu tEjamai nAda bIjamai AMdhra sAhitI amara kOSamai avatariMcenu annamayya asatOmA sadgamaya avatariMcenu annamayya asatOmA sadgamaya pApaDugA naTTiMTa pAkutU BAgavatamu cEpaTTenayA harinAmammunu AlakiMcaka aramuddalanE muTTaDayA telugu BAratiki velugu hAratai edalayalO pada kavitalu kalaya tALLapAkalO edigE annamayya tamasOmA jyOtirgamaya tamasOmA jyOtirgamaya tamasOmA jyOtirgamaya Click here to hear the song
అ: ఓం... ఓం.. తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జ్నానపథం ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం అన్నమయ్య జననం... ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గమ్మిది నందకము బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశిస్సులు పొందినదై శివలోకమున చిద్విలాసమున డమరుధ్వనిలో గమకితమై దివ్యసభలలో నవ్య నాట్యముల పూబంతుల చేమంతిగ ఎగసి నీరద మండల నారద తుంబుర మహతీ గానవు మహిమలు తెలిసి స్థిత హిమకందుర యతిరాట్ స్సభలో తప: ఫలమ్ముగ తళుకుమని ఓం... తల్లి తనముకై తల్లడిల్లు ఆ లక్క మాంబ గర్భాలయమ్ములో ప్రవేశించె ఆ నందకము నందనానంద కారకము అన్నమయ్య జననం... ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఆ: పద్మావతియే పురుడు పోయగా పద్మాసనుడే ఉసురు పోయగా అ: విష్ణు తేజమై నాద బీజమై ఆంధ్ర సాహితీ అమర కోశమై అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయా హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయలో పద కవితలు కలయ తాళ్ళపాకలో ఎదిగే అన్నమయ్య తమసోమా జ్యోతిర్గమయ తమసోమా జ్యోతిర్గమయ తమసోమా జ్యోతిర్గమయ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment