
Song » Yedagadanikendukura / ఎదగడానికెందుకురా
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Latha / లత ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
V.Ramakrishna / వి.రామకృష్ణ ,Song Category : Children Songs
EDavaku EDavaku verrinaagannaa.. EDistE nI kaLLu nIlaalu kaaru jOjO..jOjO..jOjO..jOjO.. edagaDaanikeMdukuraa toMdara..edara bratukaMtaa ciMdaravaMdara edagaDaanikeMdukuraa toMdara..edara bratukaMtaa ciMdaravaMdara jOjO..jOjO..jOjO..jOjO.. edigOvO baDilOnu ennennO cadavaali panikiraani paaThaalu baTTiyaM peTTaali cadavakuMTE parIkShalO kaapIlu koTTaali.. paTTubaDitE..pheyil ayitE bikkamohaM vEyaali kaalEjI sITlu agacaaTlu raa avi konaDaaniki uMDaali nOTlu raa caduvu pUrtaitE medalavunu paaTlu raa aMdukE.. edagaDaanikeMdukuraa toMdara..edara bratukaMtaa ciMdaravaMdara jOjO..jOjO..jOjO..jOjO.. udyOgaM vETalOna UraMtaa tiragaali aDDamaina vaaLLaki guDmaaNiMgf koTTaali amyaamyaalarpiMcI hastaalu taDapaali iMTaryvu aMTU..kyU aMTU poddaMtaa nilavaali pilupu raakuMTE nI aasha vEsTuraa maLLaa peTTaali iMkO daraKaastu raa eMDamaavi nEkeppuDU dOstu raa aMdukE.. edagaDaanikeMdukuraa toMdara..edara bratukaMtaa ciMdaravaMdara jOjO..jOjO..jOjO..jOjO.. biyyEnu cadivi cinna baMTrOtu panikeLitE..emmElu acaTa muMdu siddamu nIvu cEyalEvu vaaLLatO yuddamu batakalEka baDipaMtulu pani nuvvu cEshEvO.. padinelladaakaa jItamivvaru.. nuvvu batikaavO caccEvO cUDaru I saMghaMlO edagaDamE daMDaga maMci kaalamokaTi vastuMdi niMDugaa apuDu edagaDamE baalalaku paMDaga aMdaakaa.. edagaDaanikeMdukuraa toMdara..edara bratukaMtaa ciMdaravaMdara jOjO..jOjO..TATA..TATA..TATA..TATA..TATA..TATA..
ఏడవకు ఏడవకు వెర్రినాగన్నా.. ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు జోజో..జోజో..జోజో..జోజో.. ఎదగడానికెందుకురా తొందర..ఎదర బ్రతుకంతా చిందరవందర ఎదగడానికెందుకురా తొందర..ఎదర బ్రతుకంతా చిందరవందర జోజో..జోజో..జోజో..జోజో.. ఎదిగోవో బడిలోను ఎన్నెన్నో చదవాలి పనికిరాని పాఠాలు బట్టియం పెట్టాలి చదవకుంటే పరీక్షలో కాపీలు కొట్టాలి.. పట్టుబడితే..ఫెయిల్ అయితే బిక్కమొహం వేయాలి కాలేజీ సీట్లు అగచాట్లు రా అవి కొనడానికి ఉండాలి నోట్లు రా చదువు పూర్తైతే మెదలవును పాట్లు రా అందుకే.. ఎదగడానికెందుకురా తొందర..ఎదర బ్రతుకంతా చిందరవందర జోజో..జోజో..జోజో..జోజో.. ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలి అడ్డమైన వాళ్ళకి గుడ్మాణింగ్ కొట్టాలి అమ్యామ్యాలర్పించీ హస్తాలు తడపాలి ఇంటర్య్వు అంటూ..క్యూ అంటూ పొద్దంతా నిలవాలి పిలుపు రాకుంటే నీ ఆశ వేస్టురా మళ్ళా పెట్టాలి ఇంకో దరఖాస్తు రా ఎండమావి నేకెప్పుడూ దోస్తు రా అందుకే.. ఎదగడానికెందుకురా తొందర..ఎదర బ్రతుకంతా చిందరవందర జోజో..జోజో..జోజో..జోజో.. బియ్యేను చదివి చిన్న బంట్రోతు పనికెళితే..ఎమ్మేలు అచట ముందు సిద్దము నీవు చేయలేవు వాళ్ళతో యుద్దము బతకలేక బడిపంతులు పని నువ్వు చేశేవో.. పదినెల్లదాకా జీతమివ్వరు.. నువ్వు బతికావో చచ్చేవో చూడరు ఈ సంఘంలో ఎదగడమే దండగ మంచి కాలమొకటి వస్తుంది నిండుగా అపుడు ఎదగడమే బాలలకు పండగ అందాకా.. ఎదగడానికెందుకురా తొందర..ఎదర బ్రతుకంతా చిందరవందర జోజో..జోజో..టాటా..టాటా..టాటా..టాటా..టాటా..టాటా..
0 comments:
Post a Comment