Song » Telise Telise / తెలిసీ తెలిసీ
Song Details:Actor :
Raja / రాజా ,Actress :
Kamalini Mukharjee / కమలినీ ముఖర్జీ ,Music Director :
K.M.Radha Krishnan / కె.యమ్.రాధాకృష్ణన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chorus / బృంద గాయనీ గాయకులు -- ,
Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్ ,Song Category : Others
pallavi : telisee telisee valalO paDenae vayasu talachee valachee kalalae kanenae manasu tanuvuna ennO tapana lu raegae taha tahalOnae takadimi saagae telisee telisee valalO paDenae vayasu talachee valachee kalalae kanenae manasu charaNaM : 1 poddasalae pOka niddara pOneeka evvaridO kaeka eda lOtula daakaa bhaaramaaye yavvanaM bOru koTTae jeevitaM ragilaeTi virahaana raadhalle naenunnaa nee gaali sOkaenaa naa oopiraaDaenaa telisee telisee valalO paDenae vayasu talachee valachee kalalae kanenae manasu adi oka idilae idilae aedOlae adi oka idilae idilae aedOlae charaNaM : 2 naakoddee dooraM vennela jaagaaraM baatrooM saMgeetaM laeta eeDu aekaaMtaM kOpamochche naameeda taapamaaye nee meeda daehaalu reMDainaa praaNaalu neevaegaa visigiMchu paruvaana vidhilaeka paDivunnaa telisee telisee valalO paDenae vayasu talachee valachee kalalae kanenae manasu Click here to hear the song
పల్లవి : తెలిసీ తెలిసీ వలలో పడెనే వయసు తలచీ వలచీ కలలే కనెనే మనసు తనువున ఎన్నో తపన లు రేగే తహ తహలోనే తకదిమి సాగే తెలిసీ తెలిసీ వలలో పడెనే వయసు తలచీ వలచీ కలలే కనెనే మనసు చరణం : 1 పొద్దసలే పోక నిద్దర పోనీక ఎవ్వరిదో కేక ఎద లోతుల దాకా భారమాయె యవ్వనం బోరు కొట్టే జీవితం రగిలేటి విరహాన రాధల్లె నేనున్నా నీ గాలి సోకేనా నా ఊపిరాడేనా తెలిసీ తెలిసీ వలలో పడెనే వయసు తలచీ వలచీ కలలే కనెనే మనసు అది ఒక ఇదిలే ఇదిలే ఏదోలే అది ఒక ఇదిలే ఇదిలే ఏదోలే చరణం : 2 నాకొద్దీ దూరం వెన్నెల జాగారం బాత్రూం సంగీతం లేత ఈడు ఏకాంతం కోపమొచ్చె నామీద తాపమాయె నీ మీద దేహాలు రెండైనా ప్రాణాలు నీవేగా విసిగించు పరువాన విధిలేక పడివున్నా తెలిసీ తెలిసీ వలలో పడెనే వయసు తలచీ వలచీ కలలే కనెనే మనసు ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment