
Song » Chirugalai / చిరుగాలై
Song Details:Actor :
Siddarda / సిద్దార్ద ,Actress :
Sruthi Hasan / శ్రుతి హసన్ ,Music Director :
Salim Merchant / సలీమ్ మర్చంట్ ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్ ,Song Category : Others
saakee : chirugaalai vachchaedevarO cheli cheMpa gichchaedevarO chirakaalaM nilichaedevarO evarO vaarevarO alalaaga vachchaedevarO arachaeyi paTTaedevarO anuraagaM paMchaedevarO evarO vaarevarO evaraMTae nee veMTa naenaelae naenaMTae niluvellaa neevaelae neevaMTae tanuvellaa praemaelae praemiMchae vaeLayiMdO... pallavi : praemalaekha raasenae ilaa pedaalu praemaraekha daaTenae ilaa padaalu praemakika vaesenae ilaa praayaalu aeM maaya aeM chaestuMdO praemalaekha raasenae ilaa pedaalu praemalaali kOrenae ilaa kshaNaalu praemalOtu chaerenae padi praaNaalu ee haayi eTupOtuMdO IIchirugaalaiII charaNaM : navvaavaMTae nuvvu aa navvae guvvai taaraajuvvai naalO ae@MmaayenO ruvvaavaMTae choopu aa choopae chaepai siggai cheruvai lOlO ae@MmaayenO musinavvuku manasae laeta mogga vaesunO konachoopuku vayasae raeku vichchunO pasiraekula sogasae naeDu poota poosenO aa poovu praemaiMdO aemO... IIpraemalaekhaII
సాకీ : చిరుగాలై వచ్చేదెవరో చెలి చెంప గిచ్చేదెవరో చిరకాలం నిలిచేదెవరో ఎవరో వారెవరో అలలాగ వచ్చేదెవరో అరచేయి పట్టేదెవరో అనురాగం పంచేదెవరో ఎవరో వారెవరో ఎవరంటే నీ వెంట నేనేలే నేనంటే నిలువెల్లా నీవేలే నీవంటే తనువెల్లా ప్రేమేలే ప్రేమించే వేళయిందో... పల్లవి : ప్రేమలేఖ రాసెనే ఇలా పెదాలు ప్రేమరేఖ దాటెనే ఇలా పదాలు ప్రేమకిక వేసెనే ఇలా ప్రాయాలు ఏం మాయ ఏం చేస్తుందో ప్రేమలేఖ రాసెనే ఇలా పెదాలు ప్రేమలాలి కోరెనే ఇలా క్షణాలు ప్రేమలోతు చేరెనే పది ప్రాణాలు ఈ హాయి ఎటుపోతుందో ॥ చిరుగాలై॥ చరణం : నవ్వావంటే నువ్వు ఆ నవ్వే గువ్వై తారాజువ్వై నాలో ఏఁమాయెనో రువ్వావంటే చూపు ఆ చూపే చేపై సిగ్గై చెరువై లోలో ఏఁమాయెనో ముసినవ్వుకు మనసే లేత మొగ్గ వేసునో కొనచూపుకు వయసే రేకు విచ్చునో పసిరేకుల సొగసే నేడు పూత పూసెనో ఆ పూవు ప్రేమైందో ఏమో... ॥ప్రేమలేఖ॥
0 comments:
Post a Comment